భార్యతో గొడవపడి భర్త అదృశ్యమైన సంఘటన అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అమీన్పూర్ మండల పరిధిలోని జానకంపేట్ గ్రామానికి చెందిన గణేష్ వృతిరీత్యా బార్బర్. ఈ క్రమంలో ఈనెల 9వ తేదీన గణేష్ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
దీంతో భార్య ఫోన్ చేయగా నేను ఇంటికి రావడం లేదని చెప్పి ఫోన్ స్వీచ్చాఫ్ చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. గణేష్ బావమరిది సత్యనారాయణ ఫిర్యాదు మేరకు అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.