టిక్ టాక్ చేస్తోందని…భార్యను దారుణంగా చంపిన భర్త

husband who killed his wife

టిక్‌టాక్ ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన ఈ యాప్, చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలివాళ్ల వరకు అందర్నీ బానిసగా చేసుకుంటోంది, ఎంతో మంది జీవితాలను కూల్చివేసింది. తాజాగా తన మాట పట్టించుకోకుండా భార్య తరుచూ టిక్‌టాక్ యాప్‌లో వీడియోలు చేస్తోందని కక్ష పెంచుకున్న భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో శుక్రవారం జరిగింది. వెలినగర్ ప్రాంతానికి చెందిన కనకరాజ్(35) భవన నిర్మాణ సంస్థలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడికి గతంలో స్థానిక కాలేజీలో పనిచేసే నందిని(28) అనే యువతితో వివాహం జరిగింది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుటుంబ తగాదాలతో కనకరాజ్, నందిని రెండేళ్లుగా విడిగా ఉంటున్నారు. ఒంటరిగా ఉంటున్న నందిని సోషల్‌మీడియాకు బానిసైంది. టిక్‌టాక్ యాప్‌లో పాటలు, డైలాగులకు అసభ్య హావభావాలు ప్రదర్శించి వీడియోలు పోస్ట్ చేసేది. ఆ వీడియోలు చూసిన కనకరాజ్ అలాంటివి చేయొద్దని, బుద్ధిగా కాపురానికి రావాలని భార్యను హెచ్చరించాడు. అతడి సలహాను పట్టించుకోని నందిని మరింత రెచ్చిపోయి వీడియోలు చేయడం మొదలుపెట్టింది. భార్య వల్ల తన పరువు పోతోందని భావించిన కనకరాజ్ ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. టిక్‌టాక్‌లో వీడియోలు పోస్ట్ చేయడం మానేయాలని, కాపురానికి వచ్చి బుద్ధిగా ఉండాలని హెచ్చరించాడు. అది పట్టించుకోకుండా నందిని ఫోన్ కట్ చేసింది. మళ్లీ ఫోన్ చేస్తే బిజీ వచ్చింది. దీంతో కోపంతో ఊగిపోయిన కనకరాజు.. అదే రోజు ఫుల్లుగా మందేసి నందిని పనిచేస్తున్న కళాశాల వద్దకు వెళ్లి ఆమెతో గొడవపడ్డాడు. ర్యపై చేయిచేసుకున్నాడు. నందిని సైతం అతడిపై దాడికి పాల్పడింది. తీవ్ర ఆగ్రహావేశాలకు గురైన కనకరాజ్ వెంట తెచ్చుకున్న కత్తితో భార్యను పొడిచి పరారయ్యాడుతీవ్రంగా గాయపడిన నందినిని సహచర ఉద్యోగులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.