ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లిన ఓ గృహిణి కనిపించకుండా పోయిన ఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పహాడీషరీఫ్‌కు చెందిన సయ్యద్ యాసిన్ తొమ్మిదేళ్ల క్రితం సాల్హె బాన్ ను వివాహం చేసుకోగా ప్రస్తుతం నలుగురు పిల్లలు సంతానం. కాగా ఇటీవల చిన్న విషయమై భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఈ నెల 22న ఉదయం 7 డ్యూటీకి వెళ్లిన భర్త సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా భార్య కనిపించలేదు.
ఆమె ఆచూకీ కోసం సాధ్యమైన అన్ని ప్రాంతాలలో వెతికినా జాడ కనిపించలేదు. ఈ విషయమై భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో కానీ, 94906 17241 నంబర్‌లో కానీ సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు