స్పా అండ్ సెలూన్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న సెంటర్ నిర్వాహకుల గుట్టురట్టు చేశారు పోలీసులు. ఈ ఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎల్లప్ప కథనం ప్రకారం.. ఈస్ట్ మారేడుపల్లిలోని గీతా టిఫిన్స్ ఎదురుగా ఉన్న లరీసా ఎక్స్క్లూసివ్ స్పా అండ్ సెలూన్ సెంటర్ నిర్వాహకులు రంగం కిషోర్, అనీష్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం తుకారాంగేట్ పోలీసులు సెంటర్‌పై దాడి చేశారు. సెంటర్ యజమానులు కిషోర్, అనీష్‌లతో పాటు ఇద్దరు మహిళలను, విటుడు ఆంటొనీని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నాలుగు సెల్ఫోన్లు, రూ. 1500 నగదు స్వాధీనం చేసుకొని మంగళవారం రంగం కిషోర్, అనీష్, ఆంటొనీలను రిమాండ్ చేశారు. మహిళలను ప్రజల్వ హోంకు తరలించినట్లు తెలిపారు.