మళ్ళి రంగంలోకి హైడ్రా…

రోడ్లపై ఆక్రమణలు ఉంటే స్వచ్ఛందంగా తొలగించాలని, లేనిపక్షంలో హైడ్రా కూల్చివేస్తుందని కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ హెచ్చరించారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు రోడ్లపై ఆటంకాలు లేకుండా చూస్తామన్నారు. సోమవారం బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో జరిగిన ‘ప్రజావాణి’లో వివిధ ప్రాంతాల నుంచి 52 ఫిర్యాదులు వచ్చాయి. రోడ్లపై గోడలు, ఇతరత్రా నిర్మాణాలు చేపడుతుండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంద కలుగుతోందని పలువురు కమిషనర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఇలాంటి వాటిపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కమిషనర్‌ సూచించారు.