ప్రపంచ సంజీవనిగా ఉన్న హైడ్రాక్సీక్లోరోక్విన్ కి భారతదేశంతో ఉన్న చరిత్ర

ఈ కరోనా సమయంలో ఓ డ్రగ్ గురించే ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది. ఆ డ్రగ్ ఇప్పుడు ఇండియాలో మాత్రమే దొరుకుతుంది. దాంతో అదిప్పుడు భారతీయుల ఆస్తిగా మారింది. అదో దివ్యౌషధంలా ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. అదే హైడ్రాక్సీక్లోరోక్విన్. ఈ మధ్య ప్రతి ఒక్కరూ దీని గురించే మాట్లాడుతున్నారు. అన్ని దేశాలు దీన్నే సరఫరా చేయాలని భారతదేశాన్ని వేడుకుంటున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే హైడ్రాక్సీక్లోరోక్విన్ వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ఇది టిప్పు సుల్తాన్ ఓటమితో మొదలౌతుంది.  1799లో టిప్పును బ్రిటిష్ వారు ఓడించినప్పుడు.. మైసూర్ రాజ్యం మొత్తం శ్రీరంగపట్నంతో టిప్పు రాజధానిగా బ్రిటిషర్స్ ఆధీనంలోకి వచ్చింది. తర్వాత కొద్ది రోజులు.. బ్రిటీష్ సైనికులు తమ విజయాన్ని జరుపుకొనే ఆ సమయంలో మలేరియా కారణంగా చాలా మంది అనారోగ్యంతో బాధపడటం ప్రారంభమైంది. ఎందుకంటే శ్రీరంగపట్నానికి తీవ్రమైన దోమల సమస్య ఉంది. స్థానిక భారతీయ జనాభా శతాబ్దాలుగా అక్కడే జీవిస్తున్నారు. కాగా.. అకస్మాత్తుగా కఠినమైన భారతీయ దోమ కాటుకు గురైన బ్రిటిష్ సైనికులు, అధికారులు, బాధను భరించడం ఇబ్బందిగా మారింది. వెంటనే బ్రిటిష్ సైన్యం తమ స్టేషన్‌ను శ్రీరంగపట్నం నుంచి బెంగళూరుకు మార్చింది. (బెంగళూరు కంటోన్మెంట్ ప్రాంతాన్ని స్థాపించడం ద్వారా). ఇది స్వాగతించదగిన గొప్ప మార్పుగా చెప్పవచ్చు.

ముఖ్యంగా చల్లని వాతావరణం కారణంగా.. బ్రిటిషర్స్ వెళ్లినప్పటి నుంచి బెంగుళూరులో కూడా దోమల బెడద ఎక్కువగా ఉండేది. దీంతో మలేరియా సమస్య అక్కడ కూడా ఉండేది. అదే సమయంలో.. యూరోపియన్ శాస్త్రవేత్తలు, మలేరియా చికిత్సకు ఉపయోగపడే ‘క్వినైన్’ (పెరూలోని కొన్ని చెట్ల బెరడుల నుంచి సేకరించినవి) అనేక సాయనాల కూర్పును కనిపెట్టారు. ఆ తర్వాత నెమ్మదిగా దాన్ని ప్రయోగించడం మొదలు పెట్టారు. విస్తృతిలోకి తెచ్చేందుకు పెద్ద ఎత్తున పరీక్షించారు. బ్రిటీష్ సైన్యంలో ఈ మలేరియా సంక్షోభం సరైన సమయంలో వచ్చింది. దాంతో క్వినైన్‌ను సైన్యం పెద్దమొత్తంలో దిగుమతి చేసుకుంది. సైనికులందరికీ పంపిణీ చేసింది. వారు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి రెగ్యులర్ మోతాదులను (ఆరోగ్యకరమైన సైనికులకు కూడా) తీసుకోవాలని సూచించారు. భారతదేశంలోని అన్ని ఇతర బ్రిటిష్ స్టేషన్లలో ఇది విధిగా పాటించారు. ఎందుకంటే భారతదేశంలోని ప్రతి ప్రాంతానికి కొంతవరకు మలేరియా సమస్య ఉండేది.

కానీ.. ఇక్కడో చిన్న సమస్య ఉంది. ఈ మందుతో అనారోగ్యబారిన సైనికులు త్వరగా కోలుకున్నప్పటికీ.. భారతదేశంలో కఠినమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఎక్కువమంది సైనికులు అనారోగ్యానికి గురయ్యారు. అయితే వారిలో కొంతమంది క్వినైన్ మోతాదును తీసుకోలేదని తర్వాత తెలిసింది. ఎందుకంటే ఇది చాలా చేదుగా ఉంటుంది. కాబట్టి.. చేదు క్వినైన్‌ను నివారించడం ద్వారా.. భారతదేశంలో ఉన్న బ్రిటిష్ సైనికులు వారి రోగనిరోధక శక్తిని తక్కువగా కలిగి ఉన్నారు. దాంతో భారతదేశంలోని ఉష్ణమండల ప్రాంతాలలో మలేరియా బారిన పడే అవకాశం ఉంది. అలాగే… బ్రిటీష్ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలంతా తమ సైనికులకు ఈ మోతాదులను ఖచ్చితంగా తీసుకోవటానికి ఒప్పించే మార్గాలను ప్రయోగించడం ప్రారంభించారు. ఆ సమయంలో జునిపెర్ ఆధారిత మద్యంతో కలిపి తీసుకుంటే చేదు తొలగిపోయిన కొంతవరకు తీపిగా ఉండటం గమనించారు. దాంతో మొత్తానికి  చేదును పూర్తిగా తగ్గించే మార్గం కనుగొన్నారు. ఆ జునిపెర్ ఆధారిత మద్యం జిన్. క్వినైన్ తో కలిపిన జిన్ను ‘జిన్ & టానిక్’ అని పిలుస్తారు. ఇది తీసుకుంటే వెంటనే బ్రిటిష్ సైనికులలో హిట్ పెంచింది. క్వినిన్ ను బ్రిటిష్ సైనికులు.. జిన్ తో కలిపుకొని ప్రతిరోజూ సముపాళ్లలో తీసుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత సైన్యం వారి నెలవారీ రేషన్‌లో భాగంగా ‘టానిక్ వాటర్’ (క్వినైన్)తో పాటు కొన్ని జిన్ బాటిళ్లను కూడా ఇవ్వడం ప్రారంభించింది. తద్వారా సైనికులు జిన్ & టానిక్‌ను తయారు చేసి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ప్రతిరోజూ వాటిని తీసుకొనేవారు.

బ్రిటీష్ సైనికులలో పెరుగుతున్న జిన్, ఇతర రకాల మద్యం డిమాండ్‌ను తీర్చడానికి.. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ & వారి సహచరులు బెంగళూరు చుట్టుపక్కల అనేక స్థానిక సారాయిలను నిర్మించారు. తర్వాత వాటిని భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు రవాణా చేశారు. అలా అసంఖ్యాకంగా సారాయి మద్యం, స్వేదనం కర్మాగారాల కారణంగా.. బెంగళూరు అప్పటికే బ్రిటిషర్స్ కాలంలోనే భారతదేశం పబ్ రాజధానిగా మారింది. చివరికి.. ఈ సారాయిలలో ఎక్కువ భాగం భారత స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బ్రిటిష్ సంస్థల నుంచి కొనుగోలు చేయబడ్డాయి. విట్టల్ మాల్యా (విజయ్ మాల్యా తండ్రి) తప్ప మరెవరూ కొనుగోలు చేయలేదు. ఆ తర్వాత బెంగళూరు ప్రధాన కార్యాలయం కలిగిన యునైటెడ్ బ్రూవరీస్ అనే సమూహం క్రింద కన్సార్టియంకు నాయకత్వం వహించారు. జిన్ & టానిక్ ఒక ప్రసిద్ధ కాక్టెయిల్‌గా మారింది. అలా ఇప్పటికీ కూడా ఇది ఒక ప్రసిద్ధ పానీయం. జ్వరం లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ నివారణకు రోగులకు టానిక్ (జిన్ లేకుండా) అని పిలువబడే క్వినైన్ ను వైద్యులు విస్తృతంగా సూచిస్తున్నారు.

అదేవిధంగా ఒక సామాన్య భారతీయ పల్లెల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైనప్పుడు ఇరుగు పొరుగువారు ఇచ్చే చాలా సాధారణ సలహా ‘వైద్యుడిని సందర్శించండి.. లేదా కొంత టానిక్ పొందండి’. కాలక్రమంగా…. ఆ టానిక్ పదం చాలా ఎక్కువగా ఉపయోగించబడింది. సహజంగా ఇది ఏదైనా ఔషదానికి సూచనగా మారింది. కాబట్టి, ‘టానిక్’ అనే పదం భారతదేశంలో ‘వెస్ట్రన్ మెడిసిన్’ కు ఒక పర్యాయ పదంగా మారింది. సంవత్సరాలుగా.. క్వినైన్ దాని నుంచి అనేక రకాలు మందులు ఉత్పన్నమయ్యాయని భారతీయ వైద్యులు ఎన్నో సందర్భాల్లో సూచిస్తారు. అలా ఆ క్వినైన్… హైడ్రాక్సీక్లోరోక్విన్ గామారింది. చివరికి మలేరియాకు ప్రామాణికంగా మారింది. ప్రపంచంలో ఈరోజు ఎక్కువగా కోరుకొనే ఔషధం. కాగా హైడ్రాక్సీక్లోరోక్విన్ చరిత్రలో టిప్పుసుల్తాన్ ఓటమి.. దోమల కాటు… మద్యం రేషన్, రంగురంగుల కాక్టెయిల్స్, టానిక్స్ వెరసి హైడ్రాక్సీక్లోరోక్విన్ చరిత్ర ఇదన్నామాట.