Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోల మద్య పోటీ ఎప్పుడు రసవత్తరంగానే ఉంటుంది. తమ అభిమాన హీరో ఎక్కువ కలెక్షన్స్ సాధించాడు అంటే తమ అభిమాన హీరో ఎక్కువ వసూళ్లు సాధించాడు అంటూ అభిమానులు సోషల్ మీడియాలో చంకలు గుద్దుకుంటూ ఉంటారు. తాజాగా మెగా అభిమానులు మరియు మహేష్‌బాబు అభిమానులు ‘రంగస్థలం’ మరియు భరత్ అనే నేను చిత్రా కలెక్షన్స్ గురించి పెద్ద యుద్దమే చేస్తున్నారు. రంగస్థలం చిత్రం 200 కోట్లను సునాయాసంగా సాధించిందని, లాంగ్ రన్‌లో ఈ చిత్రం 225 కోట్లను వసూళ్లు చేసింది అంటూ మెగా ఫ్యాన్స్ అంటున్నారు. అయితే మహేష్‌బాబు ఫ్యాన్స్ మాత్రం అవి ఫేక్ కలెక్షన్స్ అంటూ కొట్టి పారేస్తున్నారు.
భరత్ అనే నేను చిత్రం 200 కోట్లు వసూళ్లు చేయకున్నా కూడా నిర్మాత పబ్లిసిటీ కోసం 205 కోట్లు అంటూ ప్రకటించాడు అని మెగా ఫ్యాన్స్ ఆరోపణలు చేస్తున్నారు. ఇలా ఇద్దరు హీరోల అభిమానుల మద్య పెద్ద యుద్దం జరుగుతుంది. ఈ యుద్దంకు ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదు. ఈ సమయంలోనే మహేష్‌బాబు మరియు రామ్ చరణ్‌లు కలిసి ఒక వేడుకలో పాల్గొన్నారు. ఆ సమయంలో వారు మాట్లాడుతూ తాము ఎప్పుడు కూడా కలెక్షన్స్ విషయంలో గొడవ పడలేదని, అభిమానులు కొన్ని సార్లు కలెక్షన్స్ విషయంలో గొడవలు పడటం తమకు ఇబ్బందిగా అనిపిస్తుందని మహేష్, చరణ్ చెప్పుకొచ్చారు. తాము ఎప్పుడు కూడా కలెక్షన్స్ పట్టించుకోకుండా స్నేహితుల మాదిరిగా కలిసి ఉంటామని చెప్పుకొచ్చారు. హీరోలు హాయిగా పార్టీలు చేసుకుంటూ ఉంటే అభిమానులు మాత్రం వారి పేర్లు చెప్పి గొడవలు పడుతూ ఉన్నారు.