బీఆర్ఎస్ నాకు అన్యాయం చేసినందుకే రాజీనామా చేస్తున్నా: ఎమ్మెల్యే రేఖా నాయక్

I am resigning because BRS did me injustice: MLA Rekha Naik
I am resigning because BRS did me injustice: MLA Rekha Naik

నేడు ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ బీఆర్ఎస్ కు రాజీనామా చేయనున్నారు. మరోసారి పోటీ చేసేందుకు బీఆర్ఎస్ అధిష్ఠానం టికెట్ నిరాకరించడంతో నిరసచెందిన రేఖనాయక్ బీఆర్ఎస్ కు రాజీనామా చేయనున్నారు. టికెట్ల ప్రకటన విడుదల చేసిన అప్పటి నుంచి అధిష్ఠానంపై ఎమ్మెల్యే గుర్రుగా ఉన్నట్లు సమాచారం . నిధుల మంజూరు నిలిపివేశారంటూ పలుమార్లు అధిష్ఠానం పై రేఖా నాయక్ ఆరోపణలు చేసిన విషయం తెలసిందే.. దీంతో ఇవాళ రేఖా నాయక్ బీఆర్ఎస్ కు రాజీనామా చేయనున్నారు. ఈ విషయం పై ఖానాపూర్ లో ఎమ్మె ల్యే రేఖా నాయక్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఆ సమావేశం లో బీఆర్ఎస్ కు రాజీనామా చేయనున్నట్లు మీడియా ద్వారా రేఖనాయక్ ప్రకటించనున్నారు. ఏ పార్టీలోకైనా వెళ్తారా? ఇం డిపెం డెం ట్ గా బరిలో నిలుస్తారా? అనే దానిపై రేఖా నాయక్ తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం . అయితే ఇప్పటికే రేఖానాయక్.. భర్త శ్యాంనాయక్ కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే..

మరోవైపు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.. ఏసీడీపీ నిధులు ఆపారని, అభివృద్ది ఆపడం ఏంటీ అంటూ ఆమె ప్రశ్నించిన దాఖలాలు ఉన్నాయి. అయినా కూడా ప్రభుత్వం స్పందించలేదు. మైనారిటీ బంధు, దళిత బంధు, బీసీ బంధు, రోడ్ల పనులు ఆపారు.. నిధులు రాకుండా నిలిపి వేశారు అని ఎమ్మెల్యే అడిగారు. నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాను.. పార్టీ మారలేదు.. ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని రేఖానాయక్ తెలిపినా ఆమె మాటలకు స్పందనరాలేదు. ప్రజలకు అభివృద్ది కావాలి..

నేను నిధులు అడిగితే కాంగ్రెస్ పార్టీ అంటున్నారు.. నేను పార్టీ మారలేదు రేఖా నాయక్ తెలిపారు. పార్టీ మారింది నా భర్త.. నేను కాదని ఆమె అన్నారు. కావాలనే తన అల్లుడు ఐపీఎస్ బదిలీపై స్పందిస్తూ ఖనాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కన్నీళ్లు పెట్టుకున్నారు కూడా. అన్యాయం చాలదన్నట్లు నా బిడ్డకు అన్యా యం చేసారు అం టూ కార్య కర్తల దగ్గర బోరున రేఖా నాయక్ విలపించారు. నా భర్త కాంగ్రెస్ లోకి వెళ్లారు.. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వారి తండ్రి సీపీఐ పార్టీలో పనిచేయడం లేదా అని ఆమె ప్రశ్నించారు రేఖానాయక్. తెలంగాణ ఉద్యమంలో పని చేశాను.. నియోజకవర్గం కోసం పని చేశాను.. 9 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నాను.. అభ్యర్థి కోసం అభివృద్దిని ఆపడం ఏం టీ అని ఖనాపూర్ ఎమ్మె ల్యే రేఖా నాయక్ అడిగారు.ఇది మంచి పద్దతి కాదు.. ఇలాంటి దొరణి ఏదైనా ఉంటే ప్రభుత్వం వెంటనే దాన్ని మార్చుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరించినా ఫలితం శున్యంగానే ఉండటంతో చివరకు రేఖానాయక్ బీఆర్ఎస్ కు ఇవాళ రాజీనామా చేయనున్నారు. అయితే ఏ పార్టీలో వెళతారు? లేక ఇండిపెండెంట్ గా బరిలో దిగుతారా? అనే అంశం పై ఉత్కంఠ నెలకొంది.