నాకు చాలా సంతోషం గా ఉంది – అల్లు అర్జున్‌

I am very happy - Allu Arjun
I am very happy - Allu Arjun

దర్శకుల దినోత్సవంలో అల్లు అర్జున్‌ పాల్గొన్నాడు . ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ పనిలో క్షణం తీరిక లేకుండా ఉండే దర్శకులు తమలో ఐక్యత ఉండాలనే ఉద్దేశంతో ఒక్కచోటికి చేరి, ఈ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ప్రతి ఏడాదీ వేడుకను ఇంతే ఉత్సాహంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ స్ఫూర్తితో సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్‌లలోని వివిధ విభాగాలు కూడా ముందుకొచ్చి వేడుకలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉన్నది ’ అని బన్నీ తెలిపారు.

I am very happy - Allu Arjun
I am very happy – Allu Arjun

అల్లు అర్జున్ ఇంకా మాట్లాడుతూ.. ‘దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని దర్శకులు దినోత్సవాన్ని నిర్వహించుకోబోతున్నామని ప్రకటించినప్పుడు తనకెంతో సంతోషం కలిగించింది. ఈ సందర్భంగా దాసరితో తమకున్న అవినాభావ సంబంధాన్ని బన్నీ గుర్తు చేసుకున్నాడు . ఈ వేడుకలో దర్శకులు అనిల్‌ రావిపూడి, శ్రీరామ్‌ ఆదిత్య, శైలేష్‌ కొలను లాంటి యువ దర్శకులు తమ స్టెప్పులతో ప్రేక్షకులని ఆకట్టుకున్నారు.