నన్ను వదిలి వెళ్లిపోయిన వారి కోసం నేను చింతించను

నన్ను వదిలి వెళ్లిపోయిన వారి కోసం నేను చింతించను

‘నన్ను వదిలి వెళ్లిపోయిన వారి కోసం నేను చింతించను. అలా బాధపడుతూ ఒక్కరోజును కూడా వృథా చేయను’ అని బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ మాజీ భార్య సుసానే ఖాన్‌ పేర్కొన్నారు. అంతేగాక ఇక జీవితంలో ఇక వెనుదిరిగే ప్రసక్తి లేదంటూ నిలిరంగు కోటుతో ఫార్మల్‌ వేర్‌‌ ధరించిన తన ఫొటోను ఆమె బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ ఫొటోలో ఆమె స్ట్రాంగ్‌ బిజినెస్‌ ఉమెన్‌లా కనిపించారు. అయితే ఆమెకు స్వయంగా ఇంటిరియల్‌ డిజైనింగ్‌ లెబుల్‌ దీ చార్‌కోల్‌ ప్రాజెక్టు ఉ‍న్న విషయం తెలిసిందే. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆమె బిజినెస్‌కు దూరమయ్యారు. తాజాగా సుసానే తిరిగి తన బిజినెస్‌పై దృష్టి పెట్టారు.

ఈ నేపథ్యంలో తను స్ట్రాంగ్‌ బిజినెస్‌ ఉమెన్‌గా పేర్కొంటూ ఈ తాజాగా ఈ ఫొటోను షేర్‌ చేసినట్లను తెలుస్తోంది. సుపానే పోస్టుకు హృతీక్‌ స్పందిస్తూ ‘సూపర్‌ పిక్‌ అంటూ’ కామెంట్‌ పెట్టాడు. దీనికి సుసానె ‘లుక్‌ అవే లుక్‌ కోసం ప్రయత్నించాను’ అంటూ నవ్వుతున్న ఎమోజీని జత చేశారు. అయితే హృతిక్‌, సుసానేలు 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ వ్యక్తిగత కారణాల వల్ల 2014లో విడాకులు తీసుకున్నారు. అయినప్పటికీ కరోనా నేపథ్యంలో అమలైన లాక్‌డౌన్‌లో వీరూ ఒకే ఇంట్లో కలిసి ఉన్న విషయం తెలిసిందే. అయితే తమ ఇద్దరూ పిల్లలు హ్రేహాన్‌, హ్రిధాన్ల కోరిక మేరకు తాత్కాలికంగా తాము ఒకే ఇంట్లో ఉన్నట్లు ఆమె ‌ వెల్లడించారు.