ఆమెపై ఇచ్చిన తీర్పును గురించే మాట్లాడుతున్నాను

ఆమెపై ఇచ్చిన తీర్పును గురించే మాట్లాడుతున్నాను

తాజాగా బాలీవుడ్‌లో మారుతున్న పరిణామాలపై స్పందించిన తాప్సీ పన్ను.. రియా, కంగనా, జయా బచ్చన్‌ గురించి మాట్లాడారు. కాగా గతంలో తాప్సీ, రియా చక్రవర్తికి మద్దతుగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై తాప్సీ చర్చించారు.‘రియా చక్రవర్తి ఎవరో నాకు నిజంగా తెలియదు. నేను కేవలం రియాకు జరుగుతున్న అన్యాయానికి, ఆమెపై ఇచ్చిన తీర్పును గురించే మాట్లాడుతున్నాను. ఇది కేవలం కొత్తది కాదు. ఇంతకముందు ఇతర పరిశ్రమల నుంచి అనేక తప్పులు జరిగాయి. మా పరిశ్రమలో(సినీ పరిశ్రమ)కూడా కొంత మంది పెద్ద స్టార్లు తప్పులు చేశారు. కానీ ఎవరిని రియా మాదిరి శారీరకంగా, మానసికంగా హింసిస్తూ చిత్రీకరించి చూపించలేదు. ఇది నాకు చాలా షాకింగ్‌గా అనిపించింది. అందుకే ఆమె గురించి నాకు ఏమి తెలియకుండానే మాట్లాడాల్సి వచ్చింది.

నా అభిప్రాయానికి మద్దతు ఇచ్చే వ్యక్తులు ఉన్నారు. అలాగే కోర్టు, దర్యాప్తు సంస్థలు తమ తీర్పును ఇవ్వక ముందే తమకు ఇష్టం వచ్చినట్లు రాసే వ్యక్తులు ఉన్నారు. వారు తమ అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరిపై ప్రభావితం చేసేలా బలవంతం చేయాలనుకుంటున్నారు. అది తప్పు అని నేను అనుకుంటున్నాను. రియా చక్రవర్తి జైలుకు వెళ్లాలని మీరు కోరుకుంటున్నారా లేదా నేరస్థులు జైలుకు వెళ్లాలని మీరు కోరుకుంటున్నారా..’ అని ప్రశ్నించారు.

అలాగే రాజ్యసభ్యలో జయా బచ్చన్‌ ఇచ్చిన ప్రసంగాన్ని తాప్సి ప్రశంసించారు. ఆమె ప్రతి విషయాన్నా చాలా ఖచ్చితంగా చెప్పారని, ఈ రోజు తను చెప్పబోయే అనేక విషయాలు ఇప్పటికే జయా బచ్చన్‌ చెప్పేసారని అన్నారు. ఇక కంగనా రనౌత్‌ గురించి మట్లాడుతూ..కంగనా వ్యాఖ్యలు ఎప్పటి నుంచో తనపై ప్రభావం చూపడం ఆగిపోయిందన్నారు. ‘ఓకే వ్యక్తి తరచూ ఒకేలా మాట్లాడితే కొన్ని రోజులకు వారి మాటలు ఎవరిపై ప్రభావం చూపించలేవు. అలాగే కంగన మాటలు కూడా న్ను ఏ విధంగానే కదిలించలేవు’ అని తాప్సీ అన్నారు.