నేను అప్రూవర్ గా మారలేదు – రామచంద్ర పిళ్ళై

I have not become an approver – Ramachandra Pillai
I have not become an approver – Ramachandra Pillai

నేను అప్రూవర్ గా మారలేదని బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చారు అరుణ్ రామచంద్ర పిళ్ళై. ఢిల్లీ మద్యం కేసులో అప్రూవర్ గా మారారని వస్తున్న వార్తలను అరుణ్ రామచంద్ర తరఫున న్యాయవాదులు ఖండించారు . తప్పుడు, నిరాధారమైన వార్తలను ప్రచురిస్తున్నారని న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు .

సీఆర్పీసీ సెక్షన్ 164 కింద అరుణ్ పిలై ఎటువంటి వాంగ్మూలం ఇవ్వలేదు అంటున్నారు న్యాయవాదులు. తప్పుడు వార్తలు కథనాలు ప్రచారం చేస్తున్న సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని న్యాయవాదులు హెచ్చరించారు .

కాగా, నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈడీ నోటీసులను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు . ఈ తరుణంలోనే.. నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈ లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు కవిత. తనపై ఎలాంటి బలవంతపు చర్యలూ ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును కోరారు.