ఇంతలా ఎలా దిగజారిపోయావ్ వర్మా ?

I suggested sri reddy scold pawan Kalyan says Director Ram Gopal Varma

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రామ్‌గోపాల్‌ వర్మ అంటే ఎవరు ? ఒకప్పుడు ఈ ప్రసన వేసుంటే ఒక సంచలన దర్శకుడు, సినీ ఇండస్ట్రీ లో తనకంటూ ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే పైకి వచ్చిన కష్టజీవి అని చెప్పుకునే వారు, అప్పటిదాకా ఒకేరకమయిన రొటీన్ రొట్ట సినిమాలకి అలవాటయిన తెలుగు ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతిని పంచి తెలుగు చలన చిత్రాల్లో ఒక కొత్త శకానికి నాంది పలికాడు తన మొదటి సినిమా శివతో, తెలుగు చిత్రాలతో మొదలెట్టి ఇండియాలోనే పెద్ద ఫిలిం ఇండస్ట్రీ అయిన బాలీవుడ్ లో బిగ్ బీ గా భావించే అమితాబ్ తో సైతం సర్కార్ సిరీస్ తీసి దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఇదంతా ఒకప్పటి మాట కానీ ఇప్పుడు అంతలా వెలుగు వెలిగిన ఓ డైరెక్టర్ ఇప్పుడు తన సినిమాలలో పస లేక మీడియా మేనేజ్మెంట్ తో సినిమాల మార్కెటింగ్ చేసేసుకుంటున్నాడు. ప్రతి సినిమాలో ఏదో ఒక వివాదాస్పద అంశాన్ని ఉండేలా చూసుకునే వర్మ పవన్ ని, పవన్ ఫాన్స్ ని తిడుతూ కాస్త టైం పాస్ చేసుకునేవాడు.

ఒక రకంగా చూసుకుంటే వర్మని అటు జనం, ఇటు పవన్ ఫ్యాన్స్ పట్టించుకోవడం మానేశారు, ఇక వివాదం ముగిసిందన్న సందర్భంలో ఇప్పుడు శ్రీ రెడ్డి కి పవన్ ని తిట్టమని చెప్పి తానెంత దిగజారిపోయాడో నిరూపించుకున్నాడు. టాలీవుడ్ లో గత కొన్నిరోజులుగా కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై నటి శ్రీ రెడ్డి నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై ఈమె చేస్తున్న నిరసనను పవన్ కళ్యాణ్….ఇలా అన్యాయం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలనీ కానీ, ఇలా టీవీ స్టూడియోలలో కూర్చుంటే న్యాయం జరగదని అన్నారు. అయితే ముందు మాములుగానే ఉన్న శ్రీ రెడ్డి, కోదండ రాం తో జరిగిన ఓ ప్రెస్ మీట్ తర్వాత రెచ్చిపోయింది. పవన్ కళ్యాణ్ పై అసభ్యకరమైన పదజాలంతో మండిపడింది. దీనిపై పవన్ అభిమానులు, నాగ బాబు , రామ్ చరణ్ ఇలా అందరి నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. కాని తాజాగా సామజిక కార్యకర్త సంధ్య మాట్లాడుతూ ఈ మొత్తం తతంగం వెనుక ఉన్నది దర్శకుడు రాంగోపాల్ వర్మ అని, ఆయనే పవన్ కళ్యాణ్ పై ఆ మాట వాడమని, అలాగైతే నువ్వు ఇంకా ఎక్కువ పబ్లిసిటీ అవుతావని చెప్పాడట.

అయితే ఆమె ప్రకటన అయితే ఇచ్చింది కానీ వర్మ ఎందుకు అలా అని ఉంటాడు. అని అందరు భావించారు, ఇదంతా కుట్ర ఏమో పాపం వర్మ ని లాగుతున్నారు ఏమో అనుకున్నారు అంతా అయితే సంధ్య ప్రకటించిన కాసేపటికి స్వయంగా వర్మే ఒక ప్రకటన చేశాడు. పవన్‌ను శ్రీ రెడ్డి విమర్శించడం వెనుక ఉన్నది తానేనని ప్రకటించి దానికి సంబంధించి ఓ వీడియోను కూడా విడుదల చేశారు. తన ప్రోద్బలంతోనే శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్‌ ని టార్గెట్ చేసిందని…దీనికి పూర్తి బాధ్యత తనదేని పెద్దవాళ్లను విమర్శిస్తేనే… అందరి దృష్టి పడుతుందని… కత్తి మహేష్ కూడా పవన్‌ను టార్గెట్ చేసి పాపులర్ అయ్యాడని చెప్పుకొచ్చారు. శ్రీరెడ్డి ఉద్యమంలో నిజాయితీ ఉందని… దానికి సహకరించేందుకే ఇలా చేయాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. తన వల్ల పవన్‌కాని, అభిమానులు కాని బాధపడితే క్షమాపణలు చెబుతున్నాన్నారు వర్మ. అలాగే శ్రీరెడ్డికి కూడా సారీ చెప్పారు. అంతే కాక శ్రీరెడ్డి కీ – సురేష్‌బాబు కీ మధ్య ‘సెటిల్‌మెంట్‌’ కోసం కూడా చేసిన ప్రయత్నం ఆయన్ని ఒక బ్రోకర్ ని కూడా చేసేసింది.

సురేష్‌బాబు కుటుంబంతో మాట్లాడి, శ్రీరెడ్డికి ఆరు కోట్లు ఇప్పించడానికి ప్లాన్‌ చేశానని కానీ, శ్రీరెడ్డి అందుకు ఒప్పుకోలేదని నిజానికి, ఆరు కోట్లు ఇవ్వడానికి సురేష్‌బాబు సైతం ఒప్పుకోడని కానీ నేనే ప్రయత్నించానని వర్మ ప్రకటించాడు. అంటే శ్రీరెడ్డికి డబ్బులు తీసుకోవడం ఇష్టం లేదు. అలాగే సురేష్‌బాబుకి కాంప్రమైజ్‌ అవడం ఇష్టం లేదు. కానీ, ఈ ఇద్దరికీ మధ్య బ్రోకరేజీ చేయడానికి వర్మ శతవిధాలా ప్రయత్నించాడట. అంటే వర్మ సినిమాల మీద పెట్టాల్సిన ఫోకస్‌ ఈ ‘బ్రోకర్‌’ పనుల మీద ఎందుకు దృష్టిపెట్టాడనేది అందరు ఆలోచిస్తున్న విషయం. వస్తుంది. అయితే ఈ ప్రకటన విన్న ప్రజలతో పాటు వర్మ ఫ్యాన్స్ వర్మ ని చీదరించుకుంటున్నారు. ఇంతలా ఎలా దిగాజారిపోయావ్ వర్మా ? అంటూ ప్రశ్నిస్తున్నారు. వర్మ దీనికేమి సమాధానం చెబుతాడో చూడాలి మరి .