“మీడియాను ఆ ఇంట్లోకి తీసుకెళ్లింది నేనే: మంచు మనోజ్”

"I was the one who took the media into that house: Manchu Manoj"
"I was the one who took the media into that house: Manchu Manoj"

జల్ పల్లిలోని మంచు మోహన్ బాబు ఫాంహౌస్ లో ఇటీవల మీడియా ప్రతినిధులపై దాడి జరిగిన విషయం అందరికి తెలిసిందే. నటుడు మోహన్ బాబు ఒక మీడియా ప్రతినిధి చేతుల్లో నుంచి మైక్ లాక్కుని దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజన్లు దీనిపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మీడియా ప్రతినిధులదే తప్పని కొంతమంది కామెంట్లు కూడా పెడుతుండగా.. మరికొందరు మోహన్ బాబును తప్పుబడుతున్నారు. తాజాగా ఈ ఘటనపై మంచు మనోజ్ స్పందించారు. ఫాంహౌస్ లోపలికి దూసుకు రావడంతో మీడియా ప్రతినిధులపై దాడి జరిగిందన్న ప్రచారాన్ని మాత్రం కొట్టిపారేశారు.

"I was the one who took the media into that house: Manchu Manoj"
“I was the one who took the media into that house: Manchu Manoj”

ఈ ఇష్యూలో మీడియా ప్రతినిధుల తప్పేమీలేదని, తానే వారిని లోపలికి తీసుకెళ్లానని స్పష్టతనిచ్చారు. తన ఏడు నెలల కూతురును తెచ్చుకోవడానికి ఫాంహౌస్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారని చెప్పారు. గేట్లు మూసేసి తనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని వివరించారు. దీంతో తాను గేట్లు పగలకొట్టి మీడియా ప్రతినిధులని వెంటబెట్టుకుని లోపలికి వెళ్లానని చెప్పారు. ఇంతలో సడెన్ గా తన తండ్రి, ఇతరులు వచ్చి తమపై దాడి చేశారని చెప్పారు. ఈ క్రమంలోనే ఒక రిపోర్టర్ కు తీవ్ర గాయాలయ్యాయని మనోజ్ వివరించారు.