ఈ గురువారం నన్ను అరెస్టు చేస్తారు.. ఆ విషయం నాకు తెలుసు.. అంతా బైడెన్ చేతుల్లోనే ఉంది అంటూ అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే ట్రంప్‌నకు ఎన్నికల ముందు అరెస్ట్ భయం పట్టుకున్నట్లు కనిపిస్తోంది.ట్రంప్ జార్జియా ఎన్నికల ఫలితాల్లో జోక్యం చేసుకున్నట్లు దాఖలైన కేసులో ఇప్పటికే లొంగిపోవాల్సి ఉంది.
గురువారం జార్జియా వెళ్లనున్న తనను.. అక్కడ రాడికల్ వామపక్ష డిస్ట్రిక్ట్ అటార్నీ ఫాని విల్లీస్ అరెస్టు చేసే ప్రమాదం ఉందని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్నంతా బైడెన్ ఆధీనంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ సమన్వయం చేస్తోందని ఆరోపించారు. ఫాని విల్లీస్ దీనిని ప్రచారం చేసుకుని.. డబ్బు పోగుచేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ ఏడాది ట్రంప్ దాఖలైన నాలుగు క్రిమినల్ కేసుల్లో ఇదొకటి. గత కేసుల్లో కూడా ఆయన బెయిల్ పొందారు. ఇప్పటికే ట్రంప్‌పై చట్టపరంగా భారీగా ఆంక్షలున్న విషయం తెలిసిందే