
మంగళగిరిలో నాలుగవ రోజు ‘మన ఇల్లు-మన లోకేష్’ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పేదలకు మంత్రి లోకేష్ శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మంగళగిరిలో గెలవలేని వాడివి ఇంకేం మాట్లాడతావ్ అని ఎగతాళి చేశారని.. కొడుకుని కూడా గెలిపించుకోలేకపోయాడని చంద్రబాబును అవమానించారని గుర్తుచేశారు. బాధ, ఆవేదనతో పెరిగిన కసి నుంచే మంగళగిరి అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. ఓడిన చోట నుంచే అన్ని వర్గాల ప్రజల కోసం కష్టపడ్డానని తెలిపారు. ‘నా గౌరవం, పరువు కాపాడిన మంగళగిరి ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని ఏ లోటు లేకుండా చూసుకుంటా’ అని స్పష్టం చేశారు.