ఐఏఎఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ నిపుణులు ఇండియన్ సొసైటీ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ ఫ్రెటర్నిటీ వార్షిక సమావేశంలో దంత సమస్యలే భారత పైలట్లకు రష్యా శిక్షణకు నిరాకరించడానికి ప్రధాన కారణంగా నిలిచింది. గగన్‌యాన్ శిక్షణ కోసం తొలుత భారత్ షార్ట్ లిస్ట్ చేసిన 60 మంది పైలట్లలో 12 మంది దంత సమస్యల కారణంగా వేణుతిరిగి రావాల్సి వచ్చింది.
అంతరిక్షంలో వ్యోమగాములకు దంత సమస్యలు చాలా సమస్యలకు దారితీస్తాయి. రష్యా నిపుణులు ఇంకా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ భారతీయ పైలట్లను ఎంపిక చేసేటప్పుడే ఎటువంటి దంత సమస్యలు ఉండకూడదని చెప్తున్నారు.
వ్యోమనౌక గాల్లోకి ఎగిరే సమయంలో తీవ్రమైన ఒత్తిడి, ప్రకంపనలను ఎదుర్కోవలసి వస్తుంది. సరిగాలేని దంతాలు ఈ సమయంలో దెబ్బ తినే ప్రమాదం ఉన్నందున అంతరిక్షంలోకి వెళ్లాక శరీరంపై ఒత్తిడి కూడా మరే అవకాశం ఉంది. పుచ్చుపళ్లు ఉంటే తీవ్ర నొప్పిని కలిగిస్తాయి.
భారత్ గగన్‌యాన్‌కు సంబంధించి రష్యా సహకారాన్ని తీసుకుంటున్న తరుణంలో అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగాములకు రష్యా దేశం శిక్షణ ఇవ్వనుంది. యూరీ గగారిన్ కాస్మోనాట్ సెంటర్లో శిక్షణ ప్రారంబం అయి ఇప్పటికే ఏడుగురు శిక్షణ పూర్తి చేసుకుని భారత్కి వచ్చేశారు. ఐఏఎఫ్ మరో 36 మందిని శిక్షణ కొరకి ఎంపిక చేయగా అతి కొద్ది మందే తుదిశిక్షణకు ఎంపిక కాబోతున్నారు. మొత్తం 12 మందిని శిక్షణకు ఎంపిక చేస్తారని సమాచారం.ఇది పూర్తి అయ్యాక వీరిలో ముగ్గురిని గగన్‌యాన్ పాజెక్టుకు తుది ఎంపిక చేస్తారు.