క్రికెటర్లకు ఘోర అవమానం

క్రికెటర్లకు ఘోర అవమానం

టీమిండియా క్రికెటర్లకు ఘోర అవమానం జరిగింది. 2021 సంవత్సరానికి గానూ ఐసీసీ ప్రకటించిన టీ20 జట్టులో ఒక్క భారత ఆటగాడికి కూడా చోటు దక్కలేదు. టీ20 ప్రపంచకప్‌ 2021లో గ్రూప్‌ దశలోనే నిష్క్రమించిన టీమిండియా.. గతేడాది పొట్టి ఫార్మాట్‌లో పెద్దగా రాణించకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

అయితే, ఐసీసీ టీ20 టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌లో ఏకంగా ముగ్గురు పాక్‌ ఆటగాళ్లకు చోటు దక్కడం విశేషం. అంతేకాకుండా ఆ ముగ్గురిలో ఒకడైన పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ను ఐసీసీ కెప్టెన్‌గా ఎంచుకోవడం మరో విశేషం. బాబర్‌ ఆజమ్‌తో పాటు గతేడాది టీ20ల్లో విశేషంగా రాణించిన పాక్‌ వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌, పాక్‌ పేసర్‌ షాహీన్‌ అఫ్రిదిలు ఐసీసీ జట్టులో చోటు దక్కించుకున్నారు.

ఈ జట్టుకు ఓపెనర్లుగా జోస్‌ బట్లర్‌, మహ్మద్‌ రిజ్వాన్‌లను ఎంపిక చేసిన ఐసీసీ.. మూడో స్థానం కోసం బాబర్‌ ఆజమ్‌ను, నాలుగో ప్లేస్‌కు మార్క్రమ్‌, ఐదో ప్లేస్‌కు మిచెల్‌ మార్ష్‌, ఆ తరువాత వరుసగా డేవిడ్‌ మిల్లర్‌, వనిందు హసరంగ, తబ్రేజ్‌ షంషి, జోష్‌ హేజిల్‌వుడ్‌, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, షాహీన్‌ అఫ్రిది లను ఎంచుకుంది. గతేడాది అంతర్జాతీయ టీ20ల్లో ప్రదర్శన ఆధారంగానే వీరిని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.