ఐసీసీ విడుదల చేసిన తాజా టెస్ట్ ర్యాంకిగ్స్‌లో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఏకంగా 30స్ధానాలు ఎగబాకి 11వ స్ధానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరగిన రెండో టెస్ట్‌లో మయాంక్ వరుసగా 150, 62 పరుగులు సాధించాడు. అదేవిధంగా మరో ఓపెనర్ శుభమాన్ గిల్ 21 స్ధానాలు ఎగబాకి 45వ స్ధానానికి చేరుకున్నాడు. ఇక తొలి స్థానంలో 903 పాయింట్లతో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఉన్నాడు. ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ 891 పాయింట్లతో రెండో స్ధానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్, మార్నస్ లబుషేన్ మూడు, నాలుగో స్ధానంలో కొనసాగుతున్నారు.
మార్నస్ లబుషేన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వరుసగా ఐదు, ఆరో స్థానాల్లో నిలిచారు. ఇక బౌలింగ్ విభాగంలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానానికి చేరుకున్నాడు. 908 పాయింట్లతో పాట్ కమ్మిన్స్ అగ్ర స్ధానంలో కొనసాగుతుండగా, 883 పాయింట్లతో రెండో స్ధానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ స్సిన్నర్ అజాజ్ పటేల్ 23 స్ధానాలు ఎగబాకి 38 వ స్ధానానికి చేరుకున్నాడు. భారత్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టి అజాజ్ పటేల్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఆల్‌రౌండర్ విభాగంలో 382 పాయింట్లతో జాసన్ హోల్డర్ తొలి స్ధానంలో ఉండగా, అశ్విన్ రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు.