ఇది నా లవ్ స్టోరీ…తెలుగు బులెట్ రివ్యూ

idi-naa-love-story-movie-review-rating

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :   తరుణ్‌, ఓవియా
నిర్మాత:      ఎస్వీ ప్రకాష్‌
దర్శకత్వం :    రమేష్‌, గోపి
సినిమాటోగ్రఫీ:   క్రిస్టోఫర్ జోసెఫ్
ఎడిటర్ :      శంకర్
మ్యూజిక్ : శ్రీనాథ్‌ విజయ్‌

బాల నటుడిగా ఎన్నో చిత్రాలలో నటించి, అందరిని మెప్పించి… నువ్వే కావాలి తో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యి, అప్పట్లో వరుస హిట్లతో అమ్మాయిల గుండెల్లో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ‘తరుణ్’… కొంతకాలం నుంచి సరైనా హిట్లు లేక సతమవుతూ బండి లాగేస్తున్నాడు. ఇప్పుడు కన్నడ సూపర్ హిట్ “సింపుల్ ఆగి ఒండి లవ్ స్టొరీ’ మూవీ ని తెలుగులో ‘ఇది నా లవ్ స్టొరీ’ గా రీమేక్ చేసాడు… ‘ప్రేమికుల రోజు’ కానుకగా ఈరోజు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది… తరుణ్ ఈ మూవీ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు… మరి ఈ మూవీతో అయిన తరుణ్ హిట్ అందుకున్నాడో లేదో? తెలియాలి అంటే రివ్యూ లోకి వెళ్ళాల్సిందే….

కథ:

మూడు ప్రేమ కథల కలయిక చిత్రమే ‘ఇది నా లవ్ స్టొరీ’ మూవీ… అభిరామ్(తరుణ్) యాడ్ ఏజెన్సీ లో జాబ్ చేస్తుంటాడు. ఒక రోజు ఒక యాడ్ పని మీద ఊటీ వెళ్తాడు… అక్కడ అభినయ (ఒవియా) తో పరిచయం ఏర్పడుతుంది… ఆ పరిచయం లోనే ఒకరి లవ్ స్టొరీ లను ఒకరు తెలుచుకోవాలనుకుంటారు, అలా వారి లైఫ్ లో జరిగిన బ్రేక్ అప్ లవ్ స్టొరీ లను షేర్ చేసుకుంటారు… ఇలా అభిరామ్ తన లవ్ స్టొరీ అభినయకి… అభినయ తన లవ్ స్టొరీ ని అభిరామ్ కి ఇలా ఒకరికొకరు చెప్పుకుంటారు… ఈ ప్రాసెస్ లో ఒకరినొకరు లవ్ చేసుకొని, ఆరోజు రాత్రి ఒక్కటవ్వుతారు… తెల్లవారే సరికి అభినయ, అభిరామ్ పై పోలీస్ కేసు పెడుతుంది… అభిరామ్ ని ప్రేమించిన అభినయ అతనిపై అసలు కేసు ఎందుకు పెట్టింది..? తరుణ్ ఫస్ట్ లవ్ ఎందుకు బ్రేక్ అయింది.? అభినయ ఫస్ట్ లవ్ ఎందుకు బ్రేక్ అయింది…? అసలు వీరిద్దరి ఒకరోజు పరిచయం ప్రేమగా ఎలా మారింది…? ఈ విషయాలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే…

విశ్లేషణ:

తరుణ్ ఎప్పటిలాగే తనకు నచ్చిన లవర్ బాయ్ క్యారెక్టర్ నే ఈ సినిమాలో కూడా ప్లే చేసాడు. ఈ సినిమాలో తరుణ్ తన నటనతో, తన ఎమోషన్ తో ప్రేక్షకులను మెప్పించాడు… ఈ సినిమాలో హీరోయిన్ లేచిపోదాం అని అడిగితే, చెల్లెలు కోసం ఆమెతో లేచిపోకుండా, ఆమెను వదలటం ప్రేక్షకులకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాలో తరుణ్ చెప్పే కొన్ని డైలాగ్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి. ఇక హీరోయిన్ ‘ఒవియా’ తెలుగులో మొదటి చిత్రం అయిన ఎంతో బాగా చేసింది… ఆమె చెప్పే డైలాగ్స్ కి ప్రేక్షకులు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ‘ఇది నా లవ్ స్టొరీ’ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్లో గా నడుస్తుంది. కానీ సెకండ్ హాఫ్ లో కొంచెం కామెడీ, లవ్, రొమాన్స్, కథలో ట్విస్ట్ లు ఉండటం వలన ప్రేక్షకులు బాగానే ఎంజాయ్ చేస్తారు… హీరో లవ్ స్టొరీ లో, ఆమె కి పెళ్లి అయిపోవడం వలన అతని గర్ల్ ఫ్రెండ్ ప్లేస్ లో హీరోయిన్ ని ఊహించుకొని కథ చెప్పటం… హీరోయిన్ లవ్ స్టొరీ లో కూడా ఆమె బాయ్ ఫ్రెండ్ ప్లేస్ లో హీరోని ఊహించుకొని కథ చెప్పటం కొత్తగా అనిపించింది…

ఈ సినిమాకి డైలాగ్స్ చాలా ప్లస్ అవుతాయి… ‘కుక్క బిస్కెట్ లో కుక్క ఉండదు గాని, ఐస్ క్రీం లో ‘క్రీం’ ఉంటుంది’… “కాలు తొక్కితేనే సారీ చెప్పుతారు, కానీ హృదయం తొక్కి కూడా సారీ చెప్పరు” ఇలా కొన్ని డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి… డైరెక్టర్స్ రమేష్, గోపి… వీరిద్దరు ఈ కథ మొత్తం డైలాగ్స్ తోనే నడిపించారు… కామెడీ మీద కూడా కొంచెం శ్రద్ధ పెడితే బాగుండేది… ఫస్ట్ హాఫ్ లో కూడా కొంచెం కామెడీ పెడితే ఇంకా బాగుండేది… సినిమా మొత్తం డైలాగ్స్ పెట్టి, క్లైమాక్స్ లో సరైనా డైలాగ్స్ పెట్టకుండా రొటీన్ సినిమాలా ఈ సినిమాని కూడా ముగించారు. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే ఒకటి రెండు పాటలు ఆకట్టుకుంటాయి… బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు… సినిమాటోగ్రఫి ‘క్రిస్టోఫర్ జోసెఫ్’ సినిమాలోని ప్రతి ఫ్రేమ్ ని బాగా ప్రెసెంట్ చేశారు. తరుణ్, ఒవియా ని బాగా చూపించాడు. నిర్మాత  ‘ఎస్వీ ప్రకాష్‌ ‘ ఎక్కడా రాజీ పడకుండా బాగా తీసాడు… నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ …

తరుణ్
ఒవియా
కథ
కొన్ని డైలాగ్స్

మైనస్ పాయింట్స్ …

మ్యూజిక్
ఎడిటింగ్
కామెడీ
ఫస్ట్ హాఫ్

తెలుగు బులెట్ రేటింగ్ … 2.5\5