తెలంగాణ ప్రభుత్వం మాస్క తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో మాస్క లేకుండా బయటకు వస్తే భారీ జరిమానాలు పడుతున్నాయి. మెయిన్ రోడ్డుపై ఉన్న గళ్ళీలో ఉన్నా.. మాస్క్ లేకుండా కనిపిస్తే మాత్రం జరిమానా కట్టాల్సిందే. తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా పటిష్ఠ చర్యలు చేపట్టింది. అంతటితో ఆగకుండా మాస్క్ లేకుండా ఇంటి నుంచి బయటకు వచ్చే వారిని గుర్తించేందుకు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు తెలంగాణ పోలీసులు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మాస్క్ లేకుండా తిరిగే వ్యక్తులను గుర్తిస్తుంది. పరిమితికి మించి జనం ఒకే చోట గుమిగూడినా.. ఇట్టే పసికట్టేస్తంది. అయితే దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ పోలీసులు ఈ సరి కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
కాగా హైదరాబాద్, సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఈ విధానం అమల్లోకి తెస్తున్నామని అన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కాలనీలు బస్తీల్లో స్థానికుల సహకారంతో పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ స్థానిక పోలీసు స్టేషన్లకు అనుసంధానం చేశారు. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మాస్క్ లేకుండా తిరిగే వారిని గుర్తిస్తారు. అలాగే ప్రధాన రోడ్లు కూడళ్ల వద్ద ఉండే సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ నుంచి స్థానికంగా గస్తీలో ఉండే సిబ్బందికీ మాస్క్ లేకుండా తిరిగే వారి వివరాలు అందిస్తారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ఏటీఎం కేంద్రాల్లో, విజువల్ రికార్డయిందో వారిపై దాడులు చేస్తారు. గస్తీ వాహనం క్షణాల్లోనే అక్కడికి చేరుకుంటుంది. మాస్కు లేని వారికి మొదట కౌన్సెలింగ్ ఇచ్చి వివరాల్ని నమోదు చేసుకొని పంపిస్తారు. ఆదేపనిగా మాస్క్ లేకుండా తిరుగుతూ పట్టుబడితే మాత్రం ముక్కుపిండి మరీ జరిమానా వసూలు చేస్తారు.