చెర్రీను కుమారుడిలా భావిస్తా.. బన్నీబంగారం: సముద్ర ఖని..?

Samudrakhani
Samudrakhani

ఇటు నటుడిగా ..అటు దర్శకుడిగా.. సముద్రఖని గారు సూపర్ బిజీగా ఉన్నారు . ఇటీవలే దర్శకుడుగా ‘బ్రో’ సినిమాతో మరో హిట్‌ను అందుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మెగా హీరోలు అల్లు అర్జున్‌, రామ్‌చరణ్ పై ప్రశంసలు కురిపించారు. ‘RRR ’ సినిమా సమయంలో చెర్రీ ,తాను స్నేహితులమయ్యామని చెప్పారు.

చెర్రీని కుమారుడిలా భావిస్తానని అన్నారు. అల్లు అర్జున్ అందరితోనూ ప్రేమగా ఉంటారని చెప్పారు. ‘‘రామ్‌చరణ్‌తో కలిసి ‘RRR ’‌లో నటించాను. నన్ను బాబాయ్ అని పిలిచేవాడు. ఆ సమయంలో మేమిద్దరం స్నేహితులమయ్యాం. అతడిని నా సొంత కుమారుడిలా భావిస్తా” అని సముద్రఖని చెప్పారు. చెర్రీ కి ఏ కష్టం రాకూడదని దేవుడిని ప్రార్థించే వారిలో తానూ ఉంటానని అన్నారు.

చరణ్–ఉపాసన దంపతులకు క్లీంకార పుట్టినప్పుడు మెసేజ్‌ పెట్టానని తెలిపారు. ‘గేమ్ చేంజర్‌’‌ సినిమాలోనూ చరణ్‌తో కలిసి శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నానని చెప్పారు. ఇక బన్నీతో కలిసి ‘అల వైకుంఠపురం’ సినిమాలో నటించానని చెప్పారు. బన్నీని తాను అన్బు అర్జున్ అని పిలుస్తానని అన్నారు.

‘‘అన్బు అంటే ప్రేమ అని అర్థం. ఆయన అందరితో ప్రేమగా ఉంటారు. షూటింగ్ సమయంలో నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బన్నీ బంగారం లాంటి మనసున్న వ్యక్తి” అని ప్రశంసలు కురిపించాడు.