కడప జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన సాయి మనోజ్ ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో చదువుతున్నాడు. హాస్టల్‌లో ఉంటున్న సాయి మనోజ్ ఎవరూ లేని సమయంలో గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
బయటికి వెళ్లి వచ్చిన స్నేహితులు తలుపు కొట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూసి షాక్‌కి గురయ్యారు. లోపల ఉరికి వేలాడుతున్న సాయి మనోజ్‌ని చూసి భయాందోళనకు గురై వెంటనే హాస్టల్ వార్డెన్‌కి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.