దేశంలోని 10 ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటి)లో ఇరవై ఏడు మంది విద్యార్థులు గత ఐదేళ్లలో ఆత్మహత్య చేసుకున్నారని సమాచార హక్కు(ఆర్టీఐ) ప్రశ్నకు సమాధానంగా వెల్లడైంది. మానవ వనరుల మరియు అభివృద్ధి మంత్రిత్వశాఖ(ఎంహెచ్‌ఆర్‌డి) ఆధ్వర్యంలోని ఉన్నత విద్యా శాఖ గణాంకాల ప్రకారం ఐఐటి మద్రాసు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది, ఈ కాలంలో ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్గౌర్ డిసెంబర్ 2న అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎంహెచ్‌ఆర్‌డి 2014 నుంచి 2019 మధ్య ఐఐటి మద్రాస్‌కు చెందిన ఏడుగురు విద్యార్థులు, ఐఐటి ఖరగ్‌పూర్‌కు చెందిన ఐదుగురు, ఐఐటి డిల్లీ, ఐఐటి హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఐఐటి బొంబాయి, ఐఐటి గువహతి, ఐఐటి రూర్కీకి చెందిన ఇద్దరు విద్యార్థులు కూడా ఈ కాలంలో తమ జీవితాలను ముగించారు.
ఈ కాలంలో, వారణాసి ఐఐటి(బిహెచ్‌యు), ఐఐటి(ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్) ధన్‌బాద్, ఐఐటి కాన్పూర్ నుండి ఒక్కొక్క విద్యార్థి తీవ్ర అడుగు వేశారు.