ఇలియానా పెళ్ల‌యిపోయిందా..?

Ileana Controversy Comments On Amar Akbar Anthony Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్లి స్థిర‌ప‌డ్డ గోవా భామ ఇలియానాపై కొన్నిరోజుల క్రితం ఓ వార్త షికారు చేసింది. బాయ్ ఫ్రెండ్, ఆస్ట్రేలియ‌న్ ఫొటో గ్రాఫ‌ర్ ఆండ్రూ నీబోన్ ను ఆమె ర‌హ‌స్యంగా పెళ్లిచేసుకుంద‌ని. కానీ ఈ వార్త‌ల‌ను అప్ప‌ట్లో ఇలియానా తోసిపుచ్చింది. ప్రేమ‌విష‌యాన్ని అంగీక‌రించి..ఆండ్రూ నీబోన్ తో బ‌హిరంగంగా చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగిన ఇలియానా పెళ్లి విష‌యంలో మాత్రం మౌనంగా ఉన్న కార‌ణం ఎవ‌రికీ అర్ధంకాలేదు. అయితే తాజాగా క్రిస్మ‌స్ సంద‌ర్భంగా ఇలియానా ఇన్ స్టాగ్రామ్ లో ఫొటో చూస్తే..ఆమెకు పెళ్ల‌యిపోయిద‌న్న అభిప్రాయం క‌లుగుతోంది. రెడ్ క‌ల‌ర్ డ్రెస్ లో క్రిస్మ‌స్ ట్రీని అలంకరిస్తున్నప్పుడు తీసిన ఫొటో ఒక‌టి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

ఏడాది మొత్తంలో నాకు ఇష్ట‌మైన రోజు క్రిస్మ‌స్. హ్యాపీ హాలిడేస్. ఈ ఫొటో తీసింది నా హ‌బ్బీ ఆండ్రూ నీబోన్ అని క్యాప్ష‌న్ ఇచ్చింది. ఈ ఫొటో చూసిన త‌ర్వాత నెటిజ‌న్లంతా ఇలియానాకు పెళ్లయిపోయిందంటూ కామెంట్ చేస్తున్నారు. గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో త‌న పెళ్లిపై ఇలియానా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. పెళ్లి గురించి అడిగితే చాలా ఫ‌న్నీగా అనిపిస్తుంద‌ని ఆమె వ్యాఖ్యానించింది. పెళ్లిలో ఏముందని, ఇప్పుడు తాను చాలా సంతోషంగా ఉన్నాన‌ని, మంచి సినిమాలు చేస్తున్నాన‌ని తెలిపింది. త‌న‌కు తెలిసి పెళ్లి అనేది ఒక ఓవ‌ర్ రేటెడ్ అంశ‌మ‌ని, త‌న‌కు పెళ్ల‌యిన‌ప్పుడు ఈ విష‌యాన్ని స్వ‌యంగా ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పింది.

ileana dcruz calls boyfriend

ఇలాంటి విష‌యాల్లో కొంత మిస్ట‌రీ ఉండ‌డం ముఖ్య‌మని, అన్ని విష‌యాలూ చెప్పేస్తే ఇక ప్రేక్ష‌కుల‌కు త‌న గురించి తెలుసుకోవాల‌నే ఆతృత ఉండ‌ద‌ని కూడా చెప్పుకొచ్చింది. బ‌హుశా ఈ కార‌ణం చేత‌నేమో ఆమె త‌న వివాహాన్ని ర‌హ‌స్యంగా ఉంచుతూ వ‌స్తోంది. ఆస్ట్రేలియాలో కుటుంబీకులు, కొద్దిమంది సన్నిహితుల స‌మ‌క్షంలో ఇలియానా, ఆండ్రూనీబోన్ వివాహం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఇలియానా పోస్ట్ చేసిన ఫొటోపై కొంద‌రు మ‌రో అభిప్రాయం వ్య‌క్తంచేస్తున్నారు. ఇలియానా త్వ‌ర‌లో ఆండ్రూను పెళ్లిచేసుకోబోతోంద‌ని, అందుకే హ‌బ్బీ అని పిలిచి ఉంటుంద‌ని కొంద‌రు అంటున్నారు. ఇలియానానే దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది