ఇలియానా కూడా ఆ ప్రయోగంతో…!

Ileana-Dubbing-Own-Voice-Fo

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన ఇలియానా బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ ఆఫర్లు తగ్గడంతో మళ్లీ టాలీవుడ్‌లో అమర్‌ అక్బర్‌ ఆంటోనీ చిత్రంతో ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే. శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఆ చిత్రంలో మొదట అను ఎమాన్యూల్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. అయితే ఆమెతో కొన్ని సీన్స్‌ చిత్రీకరించిన తర్వాత ఇలియానాను తీసుకు రావడం జరిగింది. ఇలియానా ఈ చిత్రంలో చాలా కీలకంగా ఉంటుందని సమాచారం అందుతుంది. అందుకే ఇలియానా పాత్రకు సొంత డబ్బింగ్‌ చెప్నించాను అని, సినిమాలో ఆమె డబ్బింగ్‌ చెబితేనే బాగుంటుందని భావించాను అంటూ శ్రీనువైట్ల చెప్పుకొచ్చాడు. ఇలియానా మొదటి సారి డబ్బింగ్‌ చెప్పిన నేపథ్యంలో సినిమాపై ఆసక్తి నెలకొంది.

ileana

ఇప్పటి వరకు తెలుగు హీరోయిన్స్‌ పలువురు డబ్బింగ్‌ చెప్పేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే కొందరు సఫలం అయ్యారు, మరికొందరు మాత్రం విఫలం అయ్యారు. సమంత ‘యూటర్న్‌’ చిత్రానికి చెప్పుకుని నిరాశ పర్చింది. ఆ తర్వాత చాలా మంది కూడా డబ్బింగ్‌ చెప్పారు. కాని ఒకరు ఇద్దరు మాత్రమే సర్‌ప్రైజ్‌ చేయగలిగారు. ఇప్పుడు ఇలియానాతో సర్‌ప్రైజ్‌ అవుతామా లేదంటే షాక్‌ అవుతామా అనేది చూడాలి. భారీ ఎత్తున అంచనాలున్న అమర్‌ అక్బర్‌ఆంటోనీ చిత్రం వచ్చే 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అయ్యింది. త్వరలోనే సినిమా ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. ఆ ట్రైలర్‌లో ఇలియానా వాయిస్‌ ఎలా ఉంటుందో చూడొచ్చు. ఇలియానా ఈ చిత్రంలో చాలా విభిన్నంగా కనిపించబోతుందని ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌తో తేలిపోయింది.

amar-akbar-antony