ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చేశా…!

Jagapathi Had The Situation To Sold His Own House

ఫ్యామిలీ హీరోగా ఎన్నో సక్సెస్‌లను దక్కించుకుని ఒకప్పుడు చిరంజీవి, సుమన్‌, బాలకృష్ణలతో పోటీ పడ్డ జగపతిబాబు ఆ తర్వాత కాలంలో తగ్గి పోయాడు. స్టార్‌ హీరో రేంజ్‌లో ఉన్న సమయంలో భారీ పారితోషికాలు అందుకునేవాడు జగ్గూబాయ్‌. కాని కొన్ని వ్యసనాల కారణంగా ఏమాత్రం వెనకేసుకోలేక పోయాడని, తండ్రి ఇచ్చిన ఆస్తులను కూడా జగపతిబాబు అమ్ముకున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. హీరోగా ఉన్నంత కాలం జల్సాలు చేసిన జగపతిబాబు ఆ తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టి కాస్త జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి గట్టెక్కినట్లుగా జగపతిబాబు చెప్పుకొచ్చాడు. తాజాగా ఈయన ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.

Jagapathi babu

ఆ ఇంటర్వ్యూలో జగపతిబాబు మాట్లాడుతూ.. నేను హీరోగా ఉన్న సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమే. తప్పనిసరి పరిస్థితుల్లో ఇల్లును కూడా అమ్మేసుకున్నా. ఇల్లు అమ్మిన సమయంలో నేను లెజెండ్‌ చిత్రం షూటింగ్‌ కోసం వైజాగ్‌లో ఉన్నాను. అక్కడ ఉండే ఇల్లు అమ్మేయాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు తప్పుబట్టలేదు. కాని ఇల్లు అమ్మకుంటే బాగుంటందని చెప్పారు. కాని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇల్లు అమ్మాల్సిందే అంటూ వారికి చెప్పి ఇల్లు అమ్మేశాను. కాని ప్రస్తుతం నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మంచి ఆఫర్లతో పాటు సినిమాల్లో కూడా మంచి పాత్రలు దక్కుతున్నాయి. హీరోగా కంటే ఇప్పుడే తాను ఎక్కువగా సంపాదిస్తున్నాను అంటూ జగపతిబాబు ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

jagapathi-babu