గత మూడు రోజుల క్రితం మండపేట ఆలమూరు రోడ్డులోని కోళ్లఫారం వెనుక పంటపొలాల్లో ఇటీవల లభించిన సగం కాలిన మహిళ మృతదేహం l స్థానిక డాక్టర్ రెహమాన్ వీధిలో నివశిస్తున్న లంక శాంతికుమారి(33)గా గుర్తించారు. వ్యవసాయ పనులు చేసే లంకభద్రరావుతో ఆమెకు 2003లో వివాహం జరిగింది. వీరికి 15 ఏళ్ల కుమార్తె ఉంది. శాంతికుమారి మే 31వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో చర్చికి వెళతానని చెప్పి మళ్లీ ఇంటికి రాలేదని బంధువులు తెలిపారు. ఈ నెల ఒకటో తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్టేషనుకు వెళ్లగా.. అప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్న సగం కాలిన మృతదేహాన్ని మండపేట ఆసుపత్రిలో చూపించడంతో బంధువులు గుర్తించినట్లు తెలిపారు. ఆమెను దారుణంగా హత్యచేసింది ఎవరా? అని పోలీసులు దర్యాప్తు చేయగా విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. శాంతికుమారి (అలియాస్ రాధ)కి లంక వీరభద్రరావుతో వివాహమైంది. ఆమెకు పెళ్లీడు కి వచ్చిన కూతురు ఉంది. అయినా ఆమె తమ్ముడు వరస అయ్యే ద్వారపూడికి చెందిన ఆళ్ల విశాక్తనూజ్(22)తో మూడేళ్ల నుంచి వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. అతడు తాపీ పని చేస్తుండగా, ఆమె కుమార్తెతో వివాహం చేయించాలని కుమారిని అతడు ఒత్తిడి తెస్తున్నాడు. ఈపెళ్లి కి నిరాకరించడంతో ఆమెపై తనూజ్ కక్ష పెం చుకున్నాడు. తనూజ్ వరుసకు శాంతికుమారికి తమ్ముడు అవుతాడు. ఈనెల1న చర్చికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఆమెను రాత్రి తనూజ్ బైక్పై ఎక్కించుకుని మండపేట – ఆలమూరు రోడ్డు వైపు ఉన్న కోళ్లఫారం వెనుక పంట పొలాలకు తీసుకువెళ్లాడు. కత్తితో ఆమెను హత్యచేసి, అనుమానం రాకుండా పెట్రోలు పోసి అట్టించాడు. గురువారం మధ్యాహ్నం మండపేట – తాపేశ్వరం రోడ్డులో అనుమానంగా తిరుగుతున్న తనూజ్ను అరెస్టుచేశామని డీఎస్పీ తెలిపారు. ఆమె బంగారు తాడును అతడి వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె పర్సును అతడు డ్రైన్లో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.