ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఈ విషయంలో చాలా వరకు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నప్పటికీ కూడా చాలా మంది సీఎం జగన్ నిర్ణయాన్ని దారుణంగా విమర్శిస్తున్నారు. కాగా తాజాగా ప్రముఖ సినీ నటుడు చిరంజీవి రెండు రోజుల క్రితం రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయానికి మద్దతిస్తూ కొన్ని ఆసక్తికర వాఖ్యలు చేశారు. ఆ తరువాత తాను చేసిన వాఖ్యలు వెనక్కి తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయని సామజిక మాంద్యమాల్లో బాగా ప్రచారం జరిగింది.
కానీ ఈ విషయంలో సినీ నటుడు చిరంజీవి ఘాటుగా స్పందిస్తూ, అందరికి ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. కాగా చిరంజీవి పేరుతో ఉన్న ఓ లెటర్ హెడ్ మీద, సీఎం జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్మాణానికి తాను మద్దతిస్తున్నట్టుగా కానీ, వ్యతిరేకిస్తున్నట్టుగా కానీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదని, అవన్నీ కూడా వట్టి పుకార్లేనని, ఈ విషయంలో వస్తున్న వార్తలన్నీ కూడా అవాస్తవమని చిరంజీవి వెల్లడించారు. ఇకపోతే నా పేరు మీద వచ్చిన లెటర్ నకిలీదని స్పష్టం చేశారు. ఈమేరకు చిరంజీవి ఒక లెటర్ కూడా విడుదల చేశారు. కాగా ‘‘నేనిప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నా. మూడు రాజధానుల అంశంపై సమర్థిస్తూ కానీ, వ్యతిరేకిస్తూ కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు’’ అని చిరంజీవి వాఖ్యానించారు.