2023లో అతనికే సీఎం అయ్యే యోగం ఉంది.. వేణు స్వామి కామెంట్స్ వైరల్..!

In 2023, he is likely to become the CM.. Venu Swamy's comments are viral..!
In 2023, he is likely to become the CM.. Venu Swamy's comments are viral..!

గత కొంతకాలంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రాష్ట్రమంతటా ఉత్కంఠ నెలకొంది. నవంబర్ 30 ఎట్టకేలకు పోలింగ్ ముగిసింది. రేపు ఫలితాలు విడుదల కానుండడంతో అందరూ ఎంతో ఆసక్తిగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. సీఎం కుర్చీని ఎవరు దక్కించుకుంటారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగులు కాస్తున్నారు. అంతేకాదు ఇప్పటికే పాలు సర్వేలు కూడా విడుదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ సర్వేల ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తేలింది.

ఇదిలా ఉండగా.. గతంలో ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి 2023 సీఎం అయ్యేది ఎవరనేది దానిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2023లో బిఆర్ఎస్ విజయం సాధిస్తే కెసిఆర్ ముఖ్యమంత్రి కారు ఈసారి డైరెక్ట్ గా కేటీఆర్ సీఎం అవుతారు కేటీఆర్ జాతకం ప్రకారం.. సీఎం అయ్యే యోగం ఆయనకే ఉంది. అయితే 2023లో బిఆర్ఎస్ అధికారంలోకొస్తేనే అది సాధ్యమవుతుంది. సీఎం కావాలంటే బలమైన గ్రహాలు అనుగ్రహించాలి. ఎమ్మెల్యే స్థాయి వేరు మంత్రి స్థాయి వేరు ముఖ్యమంత్రి కావాలంటే గ్రహాలు అనుకూలించాలి. కేసీఆర్ చంద్రమంగళ యోగం ఉంది. అందుకే ఆయన పదేళ్లు సీఎం అయి పాలించారు అంటూ చెప్పుకొచ్చారు. వేణు స్వామి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.