Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎవరైనా ఎన్నికలకు ఏడాది ముందు పాదయాత్రలు చేస్తారు. కానీ జగన్ మాత్రం వెరైటీగా ఏడాది ముందే పాదయాత్ర పూర్తిచేస్తానంటున్నారు. రెండేళ్ల ముందే మ్యానిఫెస్టో ప్రకటించేశారట. అదేదో సినిమా పాటలాగా జగన్ కోయిలకు అంత తొందర ఎందుకని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అధికారం మీద యావతోనే ఇలా చేస్తున్నారని ప్రత్యర్థులు అంటుంటే.. మోడీ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న విషయం జగన్ కు లీకైందని మరికొందరు అంటున్నారు.
కానీ తాము ముందస్తు ఎన్నికలకు వెళ్లమని బీజేపీ చాలాసార్లు స్పష్టత ఇచ్చింది. నిజంగా మోడీ ముందస్తుకు వెళ్లేవారే అయితే.. జీఎస్టీ లాంటి సంస్కరణను ఇప్పుడు తీసుకురారు. దీంతో జగన్ ప్లానేంటని టీడీపీలో కూడా చర్చ జరుగుతోంది. కొంప దీసి జగన్ ఏడాది క్యాలెండర్ ముందుకెళ్లారా అని సెటైర్లు కూడా పడుతున్నాయి. కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు బేషరతు మద్దతు ప్రకటించిన జగన్ కు.. మోడీ రహస్యమేదో చెప్పానే అనుమాలు కూడా వస్తున్నాయి.
బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలకు కూడా తెలియని విషయం, జగన్ కు ఎలా తెలుస్తుందని బాబు సన్నిహితులు కూపీ లాగుతున్నారట. ఒకవేళ మోడీ జగన్ చెవిలో ఏమైనా ఊదారా అనే దిశగా ఢిల్లీ నుంచి సమాచారం రాబడుతున్నారు. పరిస్థితులు చూస్తుంటే ముందస్తు కష్టమే అనిపిస్తోంది. అలాంటప్పుడు ఏఢాది ముందుగానే పాదయాత్ర ముగించి జగన్ ఏం సాధిస్తారో ఆయనకే తెలియాలి.