మే 21 వరకు తెలంగాణలో లాక్ డౌన్…?

తెలంగాణ సర్కార్ లాక్ డౌన్ 3.0 ను మే 21వరకు పొడిగించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుతుంది. ముందు నుంచీ కూడా కేంద్రం విధించిన లోక్ డౌన్ కంటే తెలంగాణాలో మరిన్ని ఎక్కువ రోజులు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే మొదట లాక్ డౌన్ ను మే 3వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే సీఎం కేసీఆర్ మాత్రం మే 7 వరకు లాక్ డౌన్ కొనసాగిస్తామని ప్రకటించారు. మరి ఈసారి కేంద్రం లాక్ డౌన్ 3.0 అంటూ మే 17వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అయితే రాష్ట్రంలో కరోనా పరిస్థితి లాక్ డౌన్ పొడిగింపుపై కేసీఆర్ ప్రగతి భవన్ లో సుదీర్ఘంగా సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో లాక్ డౌన్ ను మే 21 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతుంది. అందుకు కారణం రాష్ట్రంలో కంటైనెమెంట్ జోన్లలో ఈనెల 21న క్వారంటైన్ గడువు ముగుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా కేంద్రం నిర్ణయించిన సడలింపులు రాష్ట్రంలో అమలు చేయాలా? వద్దా? అన్నదానిపై కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ఇంకా వలస కూలీలపై కేంద్రం తీసుకున్న యూ టర్న్ పై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. కాగా సోమవారం మరోసారి అదికారులు మంత్రులు ఈ విషయంపై కీలక సమావేశం నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించినట్లు కూడా తెలుస్తోంది. తాజాగా నిన్న మళ్లీ కేసులు 21కి పెరిగాయి. దీంతో మరింతగా కరోనాపై దృష్టి సారించారని కూడా సమాచారం. ఏది ఏమైనప్పటికీ.. కరోనా విషయంలో సీఎం కేసీఆర్ కాస్త అప్రమత్తమైనట్లుగానే తెలుస్తోంది.