రాష్ట్ర ఆదాయం పెంచే అంశంపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. పన్ను ఎగవేతలకు AI తో చెక్ పెట్టాలని అధికారులకు సూచించారు. పన్నుల వసూళ్లలో టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. పన్నుల వసూళ్లు పెరిగేలా ఆదాయార్జన శాఖలన్నీ పనిచేయాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆదాయార్జన శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పన్నుల చెల్లింపుల దగ్గర నుంచి రశీదులు, నోటీసులు జారీ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో జరగాలని చెప్పారు.





