జూలై ఒకటో తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించేశాయి. దీంతో చాలా మందికి ఊరట కలిగిందని అనుకున్నాం. అయితే అదేసమయంలో 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది కదా? మరి 14.2 కేజీల సిలిండర్ ధర తగ్గలేదేంటని చాలా మంది అనుకునే ఉంటారు.
అయితే ఇప్పుడు తగ్గింపు సంగతి ఏమో కానీ.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వంట గ్యాస్ ధరను మరోసారి పెంచేశాయి. దీంతో మన తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 1111కు చేరింది.