తొలి టీ20లో బంగ్లాదేశ్‌ గెలుపు

టీ20 మ్యాచ్‌లో

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ జట్టు ఆఖరి వరకూ గెలిచేలా ఆడింది. చిన్న తప్పిదం వల్ల అనూహ్యంగా మ్యాచ్‌ని టీమిండియా కోల్పోయి పరాజయం పాలైంది. బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌ మెన్ ముష్ఫికర్ రహీమ్ సులువైన క్యాచ్ ఇవ్వగా భారత్ ఆ క్యాచ్‌ని చేజార్చుకుంది. అంతర్జాతీయ టి20ల్లో భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య 1000వ మ్యాచ్‌ ఇది. 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ విజయం పొందింది.

బంగ్లాదేశ్ విజయం పొందాలంటే 149 పరుగులు తీయాల్సి ఉంది, చివరి 16 బంతుల్లో 35 పరుగులు అవసరం ఉండగా చాహల్ విసిరిన బంతిని ముష్ఫికర్ రహీమ్ సిక్స్ కొట్టే ప్రయత్నం చేశాడు. సులువుగా అందుకోవాల్సిన క్యాచ్‌ని తొందరలో కృనాల్‌ పాండ్య చేతుల్ని తాకి బౌండరీకి వెళ్లింది. క్యాచ్ పట్టింటే భారత్‌కి మ్యాచ్ కచ్చితంగా గెలిచే అవకాశం ఉండేది.