ఫొటోటాక్‌ : విరుష్క అదర ఛుంబనం

India Cricket Captain Virat Kohli And Anushka Sharma Kissing In Public
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

క్రికెట్‌ సంచలనం విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్కల వివాహం ఇటీవలే వైభవంగా జరిగిన విషయం తెల్సిందే. పెళ్లికి కొన్ని సంవత్సరాల ముందు నుండే వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. పెళ్లి అయిన తర్వాత కూడా వీరిద్దరు ఒకరిపై ఒకరు మరింత ప్రేమను చూపించుకుంటున్నారు. తాజాగా వీరిద్దరి ముద్దు పెట్టుకుంటూ తీసుకున్న ఒక ఫొటో సోషల్‌ మీడియాను కుదిపేస్తోంది. క్రికెట్‌తో ఎంతో బిజీగా ఉన్నా కూడా విరాట్‌ తన భార్య అనుష్కకు సమయం కేటాయిస్తూ ఉన్నాడు. 

తాజాగా వీరిద్దరు ఒక ప్రదేశంకు వెళ్లారు. అక్కడ ఒక పెయింటింగ్‌ వారిని విపరీతంగా ఆకర్షించింది. ఆ పెయింటింగ్‌లో ఒక జంట ఘాడంగా హత్తుకుని ముద్దు పెట్టుకుంటున్నట్లుగా ఉంది. అచ్చు అలాగే అనుష్క, విరాట్‌ కోహ్లీలు ఫొటోకు ఫోజ్‌ ఇచ్చారు. ఇద్దరు కూడా గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నారు. ఈ ఫొటోను విరాట్‌ కోహ్లీ సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్‌ చేశాడు. కొన్ని నిమిషాల్లోనే ఈ ఫొటోను లక్షలాది మంది చూసి వావ్‌ అంటూ స్పందిచారు. ఈ ఫొటో వారిద్దరి మద్య ప్రేమను చెప్పకనే చెబుతుంది. 

Virat Kohli Anushka Sharma Kissing