జూలై చివ‌రి నాటికి భార‌త్‌కు 30 ర‌ఫేల్ యుద్ధ విమానాలు

భార‌త వైమానిక ధళ సామ‌ర్థ్యం పెరుగుతుంది. అతి త్వరలోనే ర‌ఫేల్ యుద్ధ విమానాలు.. భార‌త్‌కు చేరుకోనున్నాయి. జూలై చివ‌రిలోగా నాలుగు ర‌ఫేల్ విమానాలు ఫ్రాన్స్ నుంచి భార‌త్‌కు రానున్న‌ట్లు తెలుస్తుంది. నిజానికి మే చివ‌రిలోగా యుద్ధ‌విమానాలు డెలివ‌రీ కావాల్సి ఉంది. కానీ ఈ క‌రోనా వైర‌స్ ప్రభావంతో ఆ యుద్ధ విమానాల డెలివ‌రీ వాయిదా ప‌డింది.

అయితే మూడు రెండు సీట్ల విమానాలు, ఒక‌టి సింగిల్ సీట‌ర్ ఉన్న‌ట్లు అధికారులు వెల్లడించారు. అలాగే.. అంబాలా ఎయిర్‌బేస్‌కు విమానాలు రానున్నాయి. ర‌ఫేల్ కొనుగోలులో కీల‌క పాత్ర పోషించిన మాజీ ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌ ఆర్‌కే బ‌దౌరియాకు స‌ముచిత గౌర‌వం ఇవ్వ‌నున్నారు. విమానాల టెయిల్ నెంబ‌ర్ల‌కు ఆర్‌కే సిరీస్ ఇవ్వ‌నున్నారు.

అంతేకాకుండా 17 గోల్డెన్ ఆర్సో స్క్వాడ్ర‌న్ పైల‌ట్ తొలి విమానాన్ని భార‌త్‌కు తీసుకురానున్నారు. మార్గ‌మ‌ధ్యంలో మిడిల్ ఈస్ట్‌లో ఉన్న ఫ్రెంచ్ ట్యాంక‌ర్‌లో ఇంధ‌నం నింప‌నున్నారు. ఇక సింగిల్ జ‌ర్నీలోనే ఇండియాకు వచ్చేయవచ్చు. కానీ చిన్న కాక్‌పిట్‌లో సుమారు 10 గంట‌ల పాటు కూర్చోవ‌డం స‌రికాదని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ర‌ఫేల్ విమానాల‌ను న‌డిపే భార‌తీయ పైల‌ట్లు కూడా శిక్ష‌ణ పూర్తి చేసుకున్నారు. కాగా గతంలోనే 36 ర‌ఫేల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్‌తో 60 వేల కోట్ల డీల్‌ను భార‌త్ కుదుర్చుకున్న విష‌యం తెలిసిందే.