రెండో స్థానంలో ఉన్న భారత్‌

రెండో స్థానంలో ఉన్న భారత్‌

వేల సంఖ్యలో నమోదవుతున్న కరోనా కేసులతో భారత్‌ బ్రెజిల్‌ను దాటేసి రెండో స్థానానికి ఎగబాకింది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 90,802 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 42 లక్షలు దాటింది. 64,60,250 కేసులతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. 42,04,614 కేసులతో భారత్‌ రెండో స్థానంలో, 41,37,606 కేసులతో బ్రెజిల్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇక దేశవ్యాప్తంగా వైరస్‌ బాధితుల్లో తాజాగా 1016 మంది మృతి చెందడంతో, మొత్తం మృతుల సంఖ్య 71,642 కు చేరింది.

భారత్‌లో ఇప్పటివరకు 32,50,429 మంది వైరస్‌ బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 8,82,542 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా రోగుల రికవరీ రేటు 77.30 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.70 శాతంగా ఉందని వెల్లడించింది.