తొలి వన్డేలో వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. ఈ సిరీస్ లో జరిగిన రెండో వన్డేలో 53పరుగుల తేడాతో భారత్ వెస్టిండీస్‌పై విజయం సాదించింది.
బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 50ఓవర్లలో 191పరుగులు చేసి 6వికెట్ల నష్ట పోయింది. భారత మహిళా జట్టు 17పరుగులకే రెండు వికెట్లు ఓపెనర్లు ప్రియా పూనియా, జెమీమా నష్టపోయింది.
కెప్టెన్ మిథాలీరాజ్ 67బంతుల్లో 40చేసి మొత్తం 4ఫోర్లు సాదించింది. పూనమ్ రౌత్ మొత్తం 128బంతుల్లో 77చేసి 4ఫోర్లు అర్ధసెంచరీ సాధించగా హర్మన్ ప్రీత్ కౌర్ 52బంతుల్లో 46చేసి 4ఫోర్లు సాదించారు. తర్వాత ఇండీస్ 47.2ఓవర్లలో 138పరుగులు తీసి పరాజయం పాలైంది. టాప్ స్కోరర్‌గా క్యాంప్‌బెల్ 90బంతుల్లో 39చేసి 2ఫోర్లు సాదించింది.
పూనమ్‌రౌత్, మిథాలీరాజ్ మూడో వికెట్‌కు 66పరుగులు సాదించగ తర్వత పూనమ్‌తో జత కలిసిన హర్మన్ 17.5ఓవర్లలోనే నాలుగో వికెట్‌కు 93పరుగులు తీశారు. పూనమ్,హర్మన్ ఆరుబంతుల వ్యత్యాసంలో అవుట్ అవ్వగా వెస్టిండీస్ ఆటగాళ్లలో భారత స్పిన్నర్లను ఎవరూ సమర్దవంతంగా ఢీ కొట్టలేక పోయారు.