
మయన్మార్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల భారీ నష్టం సంభవించింది. 694 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం 15 టన్నుల సహాయ సామగ్రిని పంపింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో మయన్మార్‌కు భారత్ ఆపన్న హస్తం అందించింది.