దేశ రక్షణ, భద్రతను దృష్టిలో పెట్టుకున్న కేంద్రం గతంలో 59 చైనా యాప్‌లను నిషేదించిన కేంద్రం తాజాగా మరో 47 యాప్‌లను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో పబ్జీ గేమ్ కూడా ఉండడం విశేషం.
అయితే మరో 275 చైనా యాప్‌లను నిషేధించే అంశాన్ని పరిశీలిస్తున్న కేంద్రం ఈ 47 యాప్‌లు గతంలో నిషేధానికి గురైన వాటిని పోలి ఉన్నాయని తేల్చడంతో వీటిని కూడా రద్దు చేసేసింది. ఈ మేరకు ఐటీ మంత్రిత్వ శాఖ నేడు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇలా చైనాకు వరుస షాక్‌లు ఇస్తున్న భారత్ ఏ విషయంలోనూ వెనకడుగు వేసేది లేదన్నట్టు కనిపిస్తుంది.