వెస్టిండీస్‌పై భారత్ విజయం

భరత్ వర్సెస్ వెస్టిండీస్‌
భరత్ వర్సెస్ వెస్టిండీస్‌

కెప్టెన్ రోహిత్ శర్మ, ఫినిషర్ దినేష్ కార్తీక్ మరియు బౌలర్లా దూకుడుకి భారత్ మొదటి T20Iలో వెస్టిండీస్‌పై 68 పరుగులతో విజయం సాధించి, బ్రియాన్ లారా స్టేడియంలో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం ఉంది.

వెస్టిండీస్‌ మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన భారత్ మంచి ఆరంభం లభించింద. మొదట వికెట్ కు 44 రన్స్ చేసారు ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ మరియు సూర్యకుమార్ యాదవ్. అకేల్ హోసేన్ బౌలింగ్ లో సూర్యకుమార్ ఔట్ అయ్యాడు. వెంటనే శ్రేయాస్ ఐఎర్ కూడా పరుగులు చేయకుండా ఔట్ అయ్యాడు. తరువాత వచ్చిన పంత్, హార్దిక్, జడేజా కూడా ఆకట్టులేక పోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తీ చేసికున్నాడు. చివరిగా హోల్డర్ బౌలింగ్ లో 44 బంతుల్లో 64 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. చివరిగా దినేష్ కార్తీక్ దూకుడు వల్ల భారత్ 190 రన్స్ సాధించారు.

వెస్టిండీస్‌ బౌలర్లో అల్జారీ జోసెఫ్ (2/46), జాసన్ హోల్డర్ (1/50), అకేల్ హోసేన్ (1/14), కీమో పాల్ (1/24), ఒబెడ్ మెక్‌కాయ్ (1/30) వికెట్లు తీశారు.

అనంతరం బ్యాటింగ్‌కి దిగిన వెస్టిండీస్‌ మొదట నుంచే కైల్ మేయర్స్ దూకుడుగా ఆడాడు. అర్ష్‌దీప్ సింగ్ తన బౌలింగ్ లో కైల్ మేయర్స్ ను అవుట్ చేసాడు. వెస్టిండీస్‌ 22 రన్స్ దగ్గర మొదటి వికెట్ కోల్పోయింది. తరువాత వచ్చిన మిగితా బ్యాటర్స్ రాణించలేక పొయ్యారు. దింతో 20 ఓవర్లలో 122రన్స్ లో 8 వికెట్స్ కోల్పోయి ఓటమిని మొట్ట కట్టుకున్నారు.

భారత్ బౌలర్లో అర్ష్‌దీప్ సింగ్, అశ్విన్ , బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు తీసికున్నారు మరియు జడేజా, భుబనేశ్వర్ కుమార్ చెరో ఒక్క వికెట్స్ తో సరిదిదుకున్నారు.

దినేష్ కార్తీక్ 19 బంతుల్లో 41 రన్స్ చేసాడు. దాంతో కార్తీక్ ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ కు ఎంపికయ్యాడు.