ఇవాల్టి నుంచి ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ విశాఖపట్నంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో జరుగుతుంది. ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్ లో గెలిచిన ఇంగ్లాండ్ జట్టు. ఈ మ్యాచ్ లో కూడా తన పట్టు కొనసాగించాలని ప్లాన్ వేస్తోంది.
అటు సొంత గడ్డపై… విజృంభించి మళ్లీ దాడిలో పడేందుకు భారత్ కసరత్తు మొదలుపెట్టింది. ఇక ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరగనున్న రెండవ టెస్టు మ్యాచ్ ఇవాళ ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ప్రారంభమవుతుంది.అయితే, విశాఖలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ తరఫున రజత్ పాటీదార్ టెస్టుల్లో అరంగేట్రం చేస్తున్నారు.