భారతదేశంలో మొట్ట మొదటి ప్రొఫెషనల్ బాక్సింగ్ లీగ్ సూపర్ బాక్సింగ్ లీగ్. సూపర్ ఫైట్ లీగ్ మొదటి సీజన్ తరువాత బ్రిటిష్-ఆసియా వ్యాపార వేత్త బిల్ దోసాంజ్ మరియు బ్రిటిష్ పాకిస్తాన్ బాక్సింగ్ ఛాంపియన్ అమీర్ ఖాన్ 2017లో సూపర్ బాక్సింగ్ లీగ్‌ను స్థాపించారు. వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ మరియు ప్రొఫెషనల్ బాక్సింగ్ ఆర్గనైజేషన్ ఇండియా సహకారంతో ఈ లీగ్ నిర్వహించబడుతుంది. మొదటి సీజన్లో పురుషులు మరియు మహిళలు రెండు బృందాలు ఉన్నాయి.
మూడు నగరాల్లో నిర్వహిస్తామని లీగ్ నిర్వాహక సంస్థలు ప్రొ స్పోర్టీఫై స్పోర్ట్జ్ లైవ్ తెలియ చేశాయి. బాక్సింగ్ లీగ్ ను ప్రత్యక్ష ప్రసారం స్టార్ స్పోర్ట్స్1లో చేయనున్నారు. క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఫుట్‌బాల్, కబడ్డీ, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్ తదితర క్రీడలలో భారత్‌లో లీగ్‌లు జరుగుతున్నాయి. ఇపుడు బాక్సింగ్ లీగ్ జరగనుంది. ఒలింపిక్ స్టయిల్ ఇండియన్ బాక్సింగ్ లీగ్ మొట్ట మొదటిసారి వచ్చే నెలలో మొదలు కానుంది. ఆరు ఫ్రాంచైజీలు పాల్గొంటున్న ఈ లీగ్ డిసెంబర్ 2 నుండి 21 వరకు జరుగబోతున్నది.