భారతీయ ఉద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది మనదేశానికి ఉద్యోగుల జీతాలు భారీ ఎత్తున పెరగనున్నట్లు పలు రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు రానున్న ఐదేళ్లలో మిగిలిన దేశాలకు చెందిన ఉద్యోగుల కంటే మనదేశానికి చెందిన ఉద్యోగుల జీతాలు ఎక్కువగా ఉంటాయని తేలింది.
ప్రముఖ గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ అయాన్ సర్వే ప్రకారం..2022లో మనదేశానికి చెందిన ఉద్యోగుల జీతాలు ఐదేళ్ల గరిష్ఠ స్థాయి 9.9 శాతానికి చేరుకుంటాయని తేలింది. సంస్థలు సైతం 2021లో జీతాలు 9.3 శాతంతో పోలిస్తే 2022లో 9.9 శాతం జీతాల పెరుగతాయని అంచనా వేస్తున్నట్లు అయాన్ తన సర్వేలో హైలెట్ చేసింది.
40కి పైగా పరిశ్రమలకు చెందిన 1,500 కంపెనీల డేటాను విశ్లేషించిన ఈ అధ్యయనంలో అత్యధికంగా జీతాలు పెరుగుతాయని అంచనా వేసింది. భారీగా పెరగనున్న జీతాలు ఈ-కామర్స్, వెంచర్ క్యాపిటల్, హైటెక్/ఐటి ,ఐటి ఎనేబుల్డ్ సర్వీసెస్ , లైఫ్ సైన్సెస్ రంగాలు ఉన్నాయి.