ఇండియన్ గోల్డెన్ బాయ్.. జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా మరో అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ క్రీడా యువనికపై జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా మరోసారి భారత జెండాను రెపరెపలాడించారు. ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో 88 17 మీటర్ల విసిరి గోల్డ్ మెడల్ అందుకున్నాడు నీరజ్ చోప్రా. దీంతో వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో స్వర్ణ పథకం సాధించిన తొలి భారత అట్లేట్ గా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. 87.82 మీటర్లు విసిరి నీరజ్ చోప్రా తర్వాతి స్థానంలో నిలిచిన పాకట్ హర్షద్ నదీమ్ సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు.