నాల్గో ఇంటి సభ్యుడిగా సింగర్ శ్రీరామ చంద్ర అద్భుతమైన పాటలు పాడుతూ వచ్చారు. అయితే ఇంత వరకు ఎన్నో భాషల్లో పాటలు పాడాను. ఇక తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు ఈ షోకు వచ్చాను. ఈ రోజు ఏ పాటలు పాడావ్.. తెలుగు పాటలు పాడవా? అంటూ మా ఇంట్లో వాళ్లు కూడా ఎప్పుడూ అడుగుతుంటారు.బిగ్ బాస్ ఐదో సీజన్ షో గ్రాండ్‌గా ప్రారంభమైంది. అఖిల్ పాటతో నాగార్జున ఎంట్రీ ఇచ్చేశారు. మిస్టర్ మజ్ను పాటలో నాగ్ తన స్టైల్లో స్టెప్పులు వేసేశారు.
ఆ తరువాత ఒక లైలా కోసం అంటూ కాలు కదిపేశారు. ఆపై బిగ్ బాస్ కోరిక మేరకు మాస్ స్టెప్పులు వేసేశారు. మాసు మరణం అంటూ నాగ్ దుమ్ములేపేశారు. పంచేంద్రియాలు, పంచభూతాలు, పంచ ప్రాణాలు అంటూ బిగ్ బాస్ ఐదో సీజన్ గురించి బాగానే ప్రమోషన్ చేశారు నాగ్. ఇంద్రుడికి వెయ్యి కళ్లు.. బిగ్ బాస్ 70కి కళ్లు.. కెమెరాలున్నాయి.
లవ్లీ లాంజ్, చిల్ ఫుల్ అంటూ ఎటో వెళ్లిపోయింది మనసు అంటూ నాగ్ గతంలోకి వెళ్లిపోయారు. పిల్లగాలు, ఆడపిల్లల గాలులు అంటూ తన స్టైల్లో కౌంటర్లు వేశారు.బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంట్ల సందడి మొదలైంది. సిరి, సన్నీలు ఎంట్రీ ఇచ్చేశారు. మూడో కంటెస్టెంట్‌గా నటి లహరి వచ్చారు. నాల్గో ఇంటి సభ్యుడిగా సింగర్ శ్రీరామ చంద్ర అద్భుతమైన పాటలు పాడుతూ వచ్చారు. అయితే ఇంత వరకు ఎన్నో భాషల్లో పాటలు పాడాను.
ఇక తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు ఈ షోకు వచ్చాను. ఈ రోజు ఏ పాటలు పాడావ్.. తెలుగు పాటలు పాడవా? అంటూ మా ఇంట్లో వాళ్లు కూడా ఎప్పుడూ అడుగుతుంటారు.పేరు మాత్రమే శ్రీరామ చంద్రుడా? లేక బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లాక కూడా ఇలానే ఉంటావా? అని సింగర్‌ని నాగ్ అడిగేశారు. నేను నాలా ఉంటాను.. శ్రీరామ చంద్రలానే ఉంటాను అని అనేశాడు. మొత్తానికి శ్రీరామ చంద్రుడిలా మంచి పేరు తెచ్చుకుంటాడేమో చూడాలి.