గ్యాస్ సిలిండర్ వాడే వారికి గుడ్ న్యూస్. వంట నూనె, సబ్బులు వంటి నిత్యం ఉపయోగించే ప్రొడక్టులను ఇకపై ఇంటి వద్దకే డెలివరీ పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తాజాగా డాటర్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని వల్ల ఇండేన్ గ్యాస్ వాడే వారికి డాబర్ ప్రొడక్టులు కూడా ఇంటి వద్దకే డెలివరీ పొందే ఛాన్స్ ఉంటుంది.
ఇరు కంపెనీల ప్రకారం.. ఇండియన్ ఆయిల్ ఇండేన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు డాబర్ రిటైల్ బిజినెస్ పార్ట్నర్లుగా కూడా వ్యవహరించనున్నారు. వీళ్లు డాబర్ ప్రొడక్టులను నేరుగా డెలివరీ బాయ్స్ ద్వారా ఎల్పీజీ గ్యాస్ కన్సూమర్లకు విక్రయించనున్నారు. తాజా ఒప్పందం వల్ల డాబర్ కంపెనీకి చాలా బెనిఫిట్ కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇండేన్ కస్టమర్లు అందరూ డాబర్ కస్టమర్లుగా మారతారు.
ఇండేన్ గ్యాస్‌కు దేశవ్యాప్తంగా 12,750 డిస్టిబ్యూటర్లు ఉన్నారు. అలాగే 90 వేలకు పైగా డెలివరీ వర్కర్లు పని చేస్తున్నారు. డాబర్ కంపెనీ పలు రకాల ప్రొడక్టులను విక్రయిస్తోంది. గ్రాసరీ సరుకుల నుంచి పర్సనల్ కేర్ వలు పలు ప్రొడక్టులను కస్టమర్లకు అందిస్తోంది. ఇవ్వన్నీ ఇండేన్ గ్యాస్ వినియోగదారులకు ఇంటి వద్దకే చేరనున్నాయి.
ఇకపోతే గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరగొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో సిలిండర్ ధర పైపైకి చేరొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కూడా ర్యాలీ చేస్తున్నాయి. బ్యారెల్‌కు 100 డాలర్లను తాకాయి. దీని వల్ల సమీప భవిష్యత్‌లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పైకి చేరొచ్చని నిపుణులు చెబుతున్నారు. కేవలం గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రమే కాకుండా ఇతర నేచురల్ గ్యాస్ ధరలు కూడా పైపైకి చేరొచ్చని పేర్కొంటున్నారు. కేవలం సిలిండర్ ధరలు మాత్రమే కాకుండా పెట్రోల్, డీజిల్ రేట్లు మరింత పైకి కదలనున్నాయి. ఇంకా వంట నూనె ధరలు కూడా కొండెక్కనున్నాయని తెలుస్తోంది. అంటే సామాన్యులపై రానున్న కాలంలో తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.