భారత స్పైస్‌జెట్ విమానం (పాకిస్థాన్‌) కరాచీలో అత్యవసర ల్యాండింగ్..

Spicejet
Spicejet

ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్ జెట్ఎస్‌జీ-11 విమానం పాకిస్థాన్‌లోని కరాచీ లో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఫ్యూయల్ ట్యాంక్ ఇండికేటర్ లైట్ సరిగా
పని చేయకపోవడంతో..విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 150 మందికిపైగా ప్రయాణిస్తుండగా.. వారంతా సురక్షితంగా ఉన్నారు.

భారత విమానంలోని ప్రయాణికులనుట్రాన్సిట్ లాంజ్‌కు తరలించారు. ఎయిర్‌క్రాఫ్ట్‌లో తలెత్తిన సమస్యను ఇంజినీర్లు పరిశీలిస్తున్నారు. ఇంజినీర్లు క్లియరెన్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే విమానం తిరిగి బయల్దేరనుంది.విమానంలో కరాచీలోసురక్షితంగా దిగిందని.. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని స్పైస్‌జెట్ అధికార ప్రతినిధి న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి వెల్లడించారు. ఎమర్జెన్సీ ఏదీ ప్రకటించలేదని..విమానం సాధారణంగానే ల్యాండింగ్ అయ్యిందని ఆయన చెప్పారు. ఇంతకు ముందు విమానంలో సమస్యలేమీ తలెత్తలేదన్నారు.