దేశంలో కరోనా కేసుల్లో హెచ్చు తగ్గులు నాలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ…

కరోనా నవీకరణలు
కరోనా

దేశంలో కరోనా కేసుల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. మంగళవారం 4.54 లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తే.. కొత్తగా 16,159 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్థారించారు.
పాజిటివిటీ రేటు 3.56 శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో 15,394 మంది కోలుకోగా.. 24 గంటల వ్యవధిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,15,212 (0.26 శాతం)కి పెరిగాయి. ఇప్పటివరకూ 4.35 కోట్ల మందికి పైగా కరోనా బారినపడగా.. 4.29 కోట్ల మంది ( అంటే 98.53 శాతం) కోలుకున్నారు.
ఇప్పటి వరకు 5.25 లక్షల మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్ర, కేరళలో వైరస్‌ కట్టడిలోనే ఉండగా.. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. నాలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ కేసులు..
తెలంగాణలోనూ కేసులు పెరుగుతున్నాయి.